ETV Bharat / state

'ధరణిలో మార్పులు చేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది'

author img

By

Published : Jan 19, 2021, 5:00 AM IST

ధరణిలో మరిన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని.. ఆ ప్రక్రియ కొనసాగుతోందని రోడ్లు భవనాలు శాఖ మంత్రి ప్రశాంత్​ రెడ్డి అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న భూ వివాదాలు, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఎవరైనా సమస్యలుంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Minister Prashant Reddy participated in the Nizamabad Zilla Parishad Plenary Session
ధరణిలో మార్పులు చేర్పుల పక్రియ కొనసాగుతోంది

ధరణిలో మరికొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని.. ఆ ప్రక్రియ కొనసాగుతోందని రోడ్లు భవనాలు శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీ రాజ్, విద్యా, వైద్య, సంక్షేమ రంగాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

త్వరలోనే కొత్త పాస్​బుక్​లు జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెండింగ్ మ్యుటేషన్లు, ఆధార్ నవీకరణ, సాదాబైనామా, పాస్​బుక్​లో వివరాలు, పేర్లలో దొర్లిన తప్పులను సరి చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న భూ వివాదాలు, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎవరైనా సమస్యలుంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: రైతులతో 10వ దఫా చర్చలు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.