ETV Bharat / state

బోధన్​ మండలంలో ఐజీ స్టీఫెన్​ రవీంద్ర పర్యటన

author img

By

Published : Mar 7, 2020, 2:28 PM IST

బోధన్​ మండలంలోని పలు గ్రామాల్లో ఐజీ స్టీఫెన్​ రవీంద్ర పర్యటించారు. పల్లెప్రగతిలో చేపట్టిన పలు పనులను ఆయన పరిశీలించారు.

IG Stephen Ravindra
బోధన్​ మండలంలో ఐజీ స్టీఫెన్​ రవీంద్ర పర్యటన

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని మినార్​పల్లి, భవానిపేట్ గ్రామాల్లో ఐజీ స్టీఫెన్​ రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని స్థానికులతో మాట్లాడి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు.

గ్రామాల్లోని నర్సరీలు, వైకుంఠదామాలు, డంపింగ్ ​యార్డులను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పలు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు పోలీస్​ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

బోధన్​ మండలంలో ఐజీ స్టీఫెన్​ రవీంద్ర పర్యటన

ఇదీ చూడండి: విపత్కర పరిస్థితుల్లో ఆత్మరక్షణతోనే దేశరక్షణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.