ETV Bharat / state

క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న గోదావరి యాజమాన్య బోర్డు

author img

By

Published : Nov 15, 2021, 5:12 AM IST

Updated : Nov 15, 2021, 7:07 AM IST

grmb team visit
grmb team visit

గోదావరి నదీ యాజమాన్య బోర్డు (grmb board) క్షేత్ర స్థాయిలో పర్యటించింది. గెజిట్ అమల్లో భాగంగా బోర్డు ఛైర్మన్ చంద్ర శేఖర్ అయ్యర్ నేతృత్వంలోని బృందం సంగారెడ్డి, నిజామాబాద్‌లో ప్రాజెక్టులను సందర్శించింది.

గోదావరి నదీ యాజమాన్య బోర్డు క్షేత్ర స్థాయిలో పర్యటించింది. గెజిట్ అమల్లో భాగంగా బోర్డు ఛైర్మన్ చంద్ర శేఖర్ అయ్యర్ (GRMB chairman chandra shkehar iyer) నేతృత్వంలోని బృందం సంగారెడ్డి, నిజామాబాద్‌లో ప్రాజెక్టులను పరిశీలించింది. సింగూర్ జలశాయం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం నిజాంసాగర్, అలీ సాగర్, గుత్ప ఎత్తిపోతల..... గరిష్ట వరద నిల్వ సామర్థ్యాలు, నిర్వహణ విధానాలను అడిగి తెలుసుకున్నారు.

కేంద్ర జలవనరుల శాఖ... గోదావరిలో రాష్ట్రానికి కేటాయించిన నీటిలో ఎంత మేర వినియోగిస్తున్నారనే అంశంతో పాటు ప్రాజెక్టుల పని తీరును తెలుసుకునేందుకు పర్యటిస్తున్నట్టు తెలిపారు. నేడు ఎస్​ఆర్​ఎస్పీతో పాటు చౌటపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకాలను పరిశీలించనున్నారు.

కేంద్రం ఇటీవల ఖరారు చేసిన పరిధికి అనుగుణంగా ప్రాజెక్టులను నదీ యాజమాన్య బోర్డులకు(River management boards) స్వాధీనం చేయాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది. పర్యటన అనంతరం ప్రాజెక్టుల స్వాధీనం విషయమై బోర్డు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ఈనెల 17న జీఆర్​ఎంబీ సమావేశం

కేంద్ర గెజిట్‌ అమలు(central gazette)కు గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ(Godavari river management board)) ప్రక్రియను వేగవంతం చేసింది. ఈనెల 17న ఐదో దఫా ఉపసంఘం సమావేశాన్ని (GRMB Subcommittee Meeting) ఏర్పాటు చేసింది. గెజిట్‌ షెడ్యూల్‌-2లో పేర్కొన్న ప్రాజెక్టులపై చర్చించేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన సభ్యులతో హైదరాబాద్‌లోని జలసౌధలో గెజిట్ అమలుపై ఉ.11 గంటలకు ఉపసంఘం (GRMB Subcommittee Meeting) భేటీ కానుంది. రెండు రాష్ట్రాలకు చెందిన నాలుగు కంపోనెంట్లను బోర్డుకు అప్పగించడంలో భాగంగా తుది నిర్ణయం తీసుకునేందుకు ఎజెండా రూపొందించారు.

కంపోనెంట్లు ఇవీ..

తెలంగాణ పరిధిలోని జె.చొక్కారావు ఎత్తిపోతల పథకంలోని గంగారం పంపుహౌస్‌, శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు (ఒకటో దశ) కింద గీసుకొండ సమీపంలో కాకతీయ కాల్వపై ఉన్న క్రాస్‌ రెగ్యులేటర్‌

ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో తొర్రిగెడ్డ ఎత్తిపోతల పంపుహౌస్‌, చంగలనాయుడు ఎత్తిపోతల పంపుహౌస్‌

ఇదీ చూడండి: Godavari Board Chairman news : సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన జీఆర్​ఎంబీ ఛైర్మన్

Last Updated :Nov 15, 2021, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.