ETV Bharat / state

క్యాన్సర్​పై అవగాహన అవసరం: నీతూ కిరణ్

author img

By

Published : Jan 28, 2021, 7:23 PM IST

క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించాలని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. విద్యావంతులు సమాజాన్ని చైతన్యవంతం చేసి క్యాన్సర్​ నుంచి రక్షించాలని సూచించారు. నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్​లో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రముఖ వైద్యులతో కలిసి క్యాన్సర్​పై అవగాహన కల్పించారు.

awareness programme about cancer in nizamabad
'క్యాన్సర్​పై అవగాహన పెంచి సమాజాన్ని రక్షించండి'

క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించాలని నిజామాబాద్ మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. క్యాన్సర్ వ్యాధితో అనేక మంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్, గర్భాశయ కాన్సర్ వంటి విషయాలను బహిర్గతం చేయడానికి మొహమాటపడితే తద్వారా భవిష్యత్తులో ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

నిజామాబాద్​లోని న్యూ అంబేడ్కర్ భవన్​లో మున్సిపల్ కార్పొరేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... క్యాన్సర్​పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

చైతన్యవంతులను చేయాలి..

క్యాన్సర్​ను ప్రాథమిక దశలో గుర్తించగలిగితే చికిత్స ద్వారా నిరోధించగలమని మేయర్​ అభిప్రాయపడ్డారు. కాబట్టి విద్యావంతులు క్యాన్సర్​పై అవగాహనతో సమాజాన్ని చైతన్యవంతం చేసి రక్షించాలని సూచించారు. అవగాహన పొందినవారు మరికొందరికి అవగాహన కల్పిస్తూ క్యాన్సర్​ను సమాజం నుంచి దూరం చేసేందుకు ప్రయత్నించాలని తెలిపారు.

రానున్న రోజుల్లో నగరంలోని అన్ని డివిజన్​లలో ఇలాంటి అవగాహన కార్యక్రమాన్ని చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పటేల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జీవన్​రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి విశాల్, స్త్రీ వైద్య నిపుణులు సంధ్యారాణి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'చెయ్యి పట్టుకుని.. జిప్​​ విప్పితే లైంగిక దాడి కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.