ETV Bharat / state

ఐసీడీఎస్​ నిధుల కోతకు నిరసనగా బడ్జెట్​ ప్రతులు దగ్ధం

author img

By

Published : Feb 4, 2021, 7:25 PM IST

Anganwadi activists central budget copies Burn at CITU office in Nizamabad
ఐసీడీఎస్​ నిధుల కోతకు నిరసనగా బడ్జెట్​ ప్రతులు దగ్ధం

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్​లో ఐసీడీఎస్​కు నిధులను తగ్గించారని అగన్​వాడీ కార్యకర్తలు అన్నారు. వెంటనే నిధులను పెంచి బలోపేతం చేయాలని డిమాండ్​ చేశారు. నిధుల తగ్గింపును నిరసిస్తూ... నిజామాబాద్​లోని సీఐటీయూ కార్యాలయం వద్ద బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు.

కేంద్ర బడ్జెట్​లో ఐసీడీఎస్​కు కిందటి సంవత్సరం కన్నా 30శాతం నిధులను తగ్గించారని... అంగన్​వాడీ యూనియన్​ నాయకురాలు రాజసులోచన అన్నారు. తగ్గింపును నిరసిస్తూ నిజామాబాద్​లోని సీఐటీయూ కార్యాలయం వద్ద బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యారంగాన్ని ప్రైవేటీకరించిందని ఆమె ఆరోపించారు.

అందులో భాగంగానే ఐసీడీఎస్​కు నిధులు తగ్గించిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఐసీడీఎస్​కు నిధులను పెంచి బలోపేతం చేయాలని డిమాండ్​ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి: విద్యుత్ షాక్​తో తల్లి... కాపాడబోయి కొడుకు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.