ETV Bharat / state

రేవంత్​ను అడ్డుకోవడం పిరికి చర్య : మహేశ్వర్​ రెడ్డి

author img

By

Published : May 28, 2020, 4:10 PM IST

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలని సందర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్,ఎంపీ రేవంత్​రెడ్డిని అడ్డుకోవడం పిరికిపందల చర్య అని నిర్మల్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్​ రెడ్డి విమర్శించారు. రైతుల సమస్యలు తెలుసుకోనివ్వకుండా ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Nirmal Congress Leaders Fires On Revanth Reddy Arrest
రేవంత్​రెడ్డిని అడ్డుకోవడం పిరికిపంద చర్య : కాంగ్రెస్​ నేత మహేశ్వర్​ రెడ్డి

నిర్మల్​ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి.. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ రేవంత్​ రెడ్డిని అరెస్టు చేయడం పట్ల నిర్మల్​ జిల్లా కాంగ్రెస్​ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన నేతలను అడ్డుకోవడం ప్రభుత్వానికి తగదని నిర్మల్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్​ రెడ్డి ధ్వజమెత్తారు.

సమస్యల పరిశీలనకు వచ్చిన ప్రజా ప్రతినిధులను అడ్డుకున్న ప్రభుత్వం.. లాక్​డౌన్​ సమయంలో వెయ్యి మందితో కార్యక్రమాలు చేసిన మంత్రి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసులు సైతం అధికార పార్టీకి దాసోహం అయ్యారని విమర్శించారు. ప్రతిపక్షాల నోరు నొక్కి పాలించానుకోవడం ప్రభుత్వ మూర్ఖత్వం అన్నారు. ఈ సమావేశంలో వికారాబాద్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామ్మెహన్​ రెడ్డి, కాంగ్రెస్​ నేతలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మండుతున్న ఎండలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.