ETV Bharat / state

మా చేపలు మమ్మల్ని పట్టుకోనివ్వండి..

author img

By

Published : Feb 28, 2020, 1:20 PM IST

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టు తయారైంది మత్సకారుల పరిస్థితి. చేపలు పట్టుకునేందుకు మత్సకారుల సంఘం తరఫున అన్ని అర్హతలు ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీ అనుమతి లభించడం లేదని వాపోతున్నారు.

fishermen problems in muthol
మా చేపలు మమ్మల్ని పట్టుకోనివ్వండి..

మత్సకారుల సహకార సంఘము తరఫున అన్ని ధ్రువపత్రాలు పొందినా గ్రామంలోని చెరువుల్లో చేపలు పట్టుకోనివ్వడం లేదని నిర్మల్​ జిల్లా ముధోల్​ మండలం చించాలకు చెందిన మత్సకారులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం ఇవ్వడంలో కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

గ్రామంలో ఉన్న ఐదు చెరువుల్లో చేపలు పట్టుకుని జీవనం సాగించేందుకు గతంలో పంచాయతీ తీర్మానం చేసి ఇచ్చిందని... అప్పటి నుంచి ప్రభుత్వం అందిస్తున్న చేప పిల్లలు చెరువుల్లో వేసుకుని వాటిని పట్టి జీవనం సాగిస్తున్నామని మత్సకారులు తెలిపారు. కానీ ఈ మధ్య కాలంలో పంచాయతీకి ఆదాయం రావడం లేదంటూ కొందరు చెరువుల్లో చేపలు పట్టుకోవద్దంటూ తమను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

మా చేపలు మమ్మల్ని పట్టుకోనివ్వండి..

ఇదీ చూడండి: ఆ ఆలోచన.. ఆదా చేసే.. ఆదాయం మిగిల్చే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.