ETV Bharat / state

బోయిన్​పల్లి తండా గుట్టల్లో చిరుతల సంచారం

author img

By

Published : Jul 21, 2020, 6:37 PM IST

నారాయణపేట జిల్లాలోని బోయిన్​పల్లితండా గుట్టల్లో చిరుతల సంచారంతో తండావాసులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతల సంచారాన్ని కొంతమంది యువకులు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో  పోస్టు చేశారు. అధికారులు స్పందించి చిరుతలు బంధించాలని కోరుతున్నారు.

Villagers Sight leopard In Boyinpally thanda in Narayanpet District
బోయిన్​పల్లి తండా గుట్టల్లో చిరుతల సంచారం

నారాయణపేట జిల్లా కేంద్రంలోని బోయిన్​పల్లి తండా పరిసరాల్లోని గుట్టల్లో రెండు చిరుతలు స్థానికులను కలవరపెడుతున్నాయి. తండా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న రెండు చిరుతలు ఆహారం కోసం సంచరిస్తున్న దృశ్యాలను కొందరు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. చిరుతల సంచారానికి సంబంధించిన సమాచారాన్ని ఉప సర్పంచ్​ లక్ష్మణ్​ నాయక్​ అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.

ఈ ప్రాంతంలో చిరుతలు లేవని.. దేవరకద్ర, కర్ణాటక ప్రాంతాల అడవుల్లోంచి ఆహారం కోసం చిరుతలు వచ్చి ఉంటాయని అటవీ శాఖ అధికారి నారాయణరావు అభిప్రాయపడుతున్నారు. తండా పరిసరాల్లో చిరుతలా.. హైనాలా అనేది నిర్ధారించాల్సి ఉందని నారాయణరావు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను ఇళ్లవద్దే కట్టేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.