ETV Bharat / state

సర్వర్​డౌన్​... రేషన్​ దుకాణాల వద్ద పరేషాన్​

author img

By

Published : Apr 5, 2020, 10:28 AM IST

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా ఉంది రేషన్​ దుకాణాల వద్ద ప్రజల పరిస్థితి. డిపోల వద్ద సర్వర్లు పనిచేయకపోవడం వల్ల బియ్యం తీసుకోవడంలో జాప్యం ఏర్పడుతోంది. నారాయణపేట జిల్లాలో సర్వర్లు మొరాయించడం వల్ల రోజుకు పది నుంచి 15 మందికి మాత్రమే బియ్యం అందుతున్నాయి.

the people ware facing problem at ration shops
సర్వర్​డౌన్​... రేషన్​ దుకాణాల వద్ద పరేషాన్​

సర్వర్​డౌన్​ కారణంగా రేషన్​ బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. నారాయణపేట జిల్లాలో డిపోల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సర్వర్లు పనిచేయకపోవడం వల్ల బియ్యం పొందలేక పోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక ఇబ్బందుల వల్ల రోజుకు పది నుంచి 15 మందికి మాత్రమే అందుతున్నాయి.

ప్రజలందరికీ అవసరమైనంత బియ్యం నిల్వ ఉందని... ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన అవసరంలేదని తహసీల్దార్ తిరుపతయ్య తెలిపారు. ఈనెలాఖరు వరకు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బియ్యం అందిస్తామని వెల్లడించారు.

సర్వర్​డౌన్​... రేషన్​ దుకాణాల వద్ద పరేషాన్​

ఇదీ చూడండి: రాష్ట్రంలోని 23 జిల్లాలకు వ్యాపించిన వైరస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.