ETV Bharat / state

Chittanuru Villagers Protest Against Ethanol Factory : ఇథనాల్‌ పరిశ్రమను వ్యతిరేకిస్తూ మహాధర్నా.. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరిక

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 12:23 PM IST

Pollution by ethanol industry
Chittanuru Villagers protest Against Ethanol Factory

Chittanuru Villagers Protest Against Ethanol Factory : నారాయణ పేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో దాదాపు 400 పైగా ఎకరాల్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేశారు. కర్మాగారం నుంచి వచ్చే వ్యర్థాలతో జలాలు కలుషితం అవుతున్నాయని జనం వాపోతున్నారు. సమీపంలోని మన్నెవాగు జలాలు కలుషితమై..మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని నారాయణపేట జిల్లా చిత్తనూర్, ఎక్లాస్‌పూర్ ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు వందో రోజుకు చేరింది.

Chittanuru Villagers protest Against Ethanol Factory ఇథనాల్‌ పరిశ్రమను వ్యతిరేకిస్తూ మహాధర్నా.. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరిక

Chittanuru Villagers Protest Against Ethanol Factory : ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుతో పర్యావరణ విధ్వంసం ఏర్పడుతోందని జనం గగ్గోలు పెడుతున్నారు. కర్మాగారం నుంచి విడుదలయ్యే రసాయన వ్యర్థాల వల్ల పంట దిగుబడి తగ్గుతోందని రైతులు ఆందోళన చెందతున్నారు. సమీపంలోని మన్నెవాగు జలాలు కలుషితమై.. మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన పడుతున్నారు. ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని నారాయణపేట జిల్లా చిత్తనూర్, ఎక్లాస్‌పూర్ ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు వంద రోజులకు చేరడం వల్ల మహాధర్నా చేపట్టారు.

Protest Against Ethanol Factory Chittanuru : నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో దాదాపు 400 పైగా ఎకరాల్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుచేశారు. కర్మాగారం నుంచి వచ్చే వ్యర్థాలతో జలాలు కలుషితం అవుతున్నాయని జనం వాపోతున్నారు. పరిసర గ్రామాల్లో సాగుచేస్తున్న పంటల దిగుబడిపైనా తీవ్ర ప్రభావంపడుతోంది. వరి, పత్తి, మిరప పంటలు ఎదగడం లేదని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన్నె వాగులో రసాయనాలు కలవడం వల్ల చేపలు, జంతుజీవజాలం మృత్యువాత పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని చిత్తనూర్, ఎక్లాస్‌పూర్ గ్రామాల వాసులు చేపట్టిన రిలే దీక్షలు 100 రోజులకు చేరాయి. పరిశ్రమను మూసివేయాలని స్థానికులు కోరుతున్నారు.

మూడొంతుల మురుగు నీరు నదుల్లోకే!

కంపెనీని రద్దు చేయాలని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరికీ పట్టింపు లేదని స్థానిక జనం మండిపడుతున్నారు. మల్లాపురం చెరువు అలుగు ద్వారా మన్నెవాగుకు వెళ్లే ప్రాంతాన్ని ధ్వంసం చేసి పరిశ్రమలో కలుపుకున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కనీసం ఇటువైపు చూడటం లేదని ఆక్షేపిస్తున్నారు. ఇదే నిర్లక్ష్యం చూపిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఆ పరిశ్రమ నుంచి విముక్తి కావాలంటూ గ్రామస్థుల నిరసన

Ethanol Factory Controversy 2023 : చిత్తనూరులో ఇథనాల్ పరిశ్రమ కాలుష్య ప్రభావం చుట్టుపక్కల 32 గ్రామాలపై ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ నుంచి వెలువడే పొగ వల్ల ఆరోగ్య సమస్యలు తప్పడం లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి తక్షణం చర్యలు చేపట్టాలని పరిసర గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

''రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు తగిన బుద్ది చెబుతాం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ ఎత్తివేయాలి.. లేకుంటే ధర్నాలు తీవ్రతరం చేస్తాం. పర్యావరణ కాలుష్యం జరుగుతుంటే అధికారులు, అధికార ప్రతిపక్ష నేతలు ఎవరూ పట్టించు కోవడంలేదు. పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్న దగ్గర కాలుష్యం వెదజల్లే పరిశ్రమను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తాం. వన్యప్రాణులు కాలుష్యానికి చనిపోతున్నా పట్టించుకోరా'' - స్థానిక ప్రజలు, చిత్తనూరు

Turmeric Board in Telangana 2023 : పసుపు బోర్డు కోసం దశాబ్దాలుగా రైతుల డిమాండ్‌.. ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు

Employees Health Scheme Telangana : సర్కారు ఉద్యోగులు, పింఛనుదారులకు తీపికబురు.. అదేంటంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.