ETV Bharat / state

Employees Health Scheme Telangana : సర్కారు ఉద్యోగులు, పింఛనుదారులకు తీపికబురు.. అదేంటంటే..?

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 7:42 AM IST

Employees Health Scheme Telangana : రాష్ట్రంలోని సర్కారు ఉద్యోగులు, పింఛనుదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీపికబురు అందించారు. న‌గ‌దు ర‌హిత, నాణ్యమైన‌ చికిత్స కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం అమలు చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో ఇకపై ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్​ఎస్​) అమలు కానుంది. సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై.. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, టీఎన్​జీవో, టీజీవో ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

EHS for Telangana Government Employees
Employees Health Scheme Telangana

Employees Health Scheme Telangana సర్కారు ఉద్యోగులు, పింఛనుదారులకు తీపికబురు.. అదేంటంటే..

Employees Health Scheme Telangana : ఉద్యోగులు, పింఛనుదారులకు న‌గ‌దు ర‌హిత, నాణ్యమైన‌ చికిత్స అందించేందుకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్​ఎస్​) పేరిట ప్రత్యేక ఆరోగ్య పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందుకోసం ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌ (ఈహెచ్​సీటీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు, పింఛనుదారుల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం అమలు చేయాలని.. తొలి పీఆర్సీ ఇచ్చిన నివేదిక మేరకు సర్కార్‌ ఈ చర్యలు చేపట్టింది. ప‌థ‌కం అమ‌లు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఛైర్‌పర్సన్‌గా ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తారు. ఉద్యోగులు, పింఛనుదారుల నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని సేకరిస్తారు. ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో మ్యాచింగ్ గ్రాంట్‌ జ‌మ చేస్తుంది. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు విధి విధానాలను ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు.

PRC for Telangana Government Employees : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్.. పీఆర్సీ ఏర్పాటు.. 5% ఐఆర్‌

EHS for Telangana Govt Employees : ఆరోగ్య పథకానికి తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గతంలోనే ప్రభుత్వానికి తెలిపారు. సీఎం కేసీఆర్‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో.. ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవో పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఉద్యోగుల ప్రతిపాదనలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నివేదికకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదముద్ర వేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో.. ఈహెచ్​ఎస్​ అమలు కోసం ప్రత్యేకంగా ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు.

Telangana PRC Commission : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్సీ కమిషన్​ ఏర్పాటు

కొత్తగా 15 పోస్టులు మంజూరు.. : ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌కు సీఎస్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనుండగా.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, విద్య, సాధారణ పరిపాలన శాఖల కార్యదర్శులు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ సీఈవో సభ్యులుగా ఉంటారు. ఉద్యోగుల తరఫున ఆరుగురిని, పింఛనర్ల తరఫున ఇద్దరిని ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది. విధాన నిర్ణయాలకు సంబంధించి బోర్డ్‌ సభ్యులు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించనున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని.. ఈహెచ్ఎస్ సీఈవోగా నియ‌మిస్తారు. ఈహెచ్ఎస్ నిర్వహ‌ణ‌కు ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు 15 పోస్టుల‌ను మంజూరు చేసింది.

Electricity Employees PRC: విద్యుత్​ ఉద్యోగులకు 7 శాతం ఫిట్​మెంట్

హరీశ్​రావు హర్షం.. : ఉద్యోగులు, పింఛనుదారులకు కొత్త ఆరోగ్య పథకం అమ‌లు చేయాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణయించ‌డంపై.. ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ‌ల మంత్రి హ‌రీశ్‌రావు హ‌ర్షం వ్యక్తం చేశారు. త‌మ‌ది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమ‌ని.. మ‌రోసారి నిరూపితమైందన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేయడంపై టీఎన్​జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

TS Anganwadi Teachers in PRC : అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.