ETV Bharat / state

అటవీ శాఖ వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి

author img

By

Published : Dec 11, 2019, 6:54 PM IST

YOUNG BOY DIED IN ACCIDENT
YOUNG BOY DIED IN ACCIDENT

అటవీ శాఖ అధికారుల వాహనం ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా చందంపేట మండలంలో జరిగింది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని బంజారానగర్ తండా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కలమంద తండాకు చెందిన కిషన్, రాజు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. దేవరకొండ వైపు వెళ్తున్న అటవీశాఖ అధికారుల వాహనం మూలమలుపు వద్ద అదుపుతప్పి బైక్​ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కిషన్ అక్కడికక్కడే మృతిచెందగా... రాజుతో పాటు ముగ్గురు అటవీశాఖ సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని... శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అటవీ శాఖ వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి

ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!

Intro:TG_NLG_31_11_12_ACCIDENT_AV_TS10103

అజయ్ కుమార్,ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ,నల్లగొండ జిల్లా

ఫోన్:8008016365,9666282848Body:నల్గొండ జిల్లా చందంపేట మండలం ఎస్సెల్బీసీ క్యాంప్ ఆఫీస్ బంజారానగర్ తండా సమీపంలో ద్విచక్రవాహనాన్ని అటవీశాఖకు చెందిన జీపు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మండలంలోని కలమంద తండాకు చెందిన కిషన్,రాజులు బైకుపై తండాకు వెళ్తుండగా,దేవరకొండ వైపు వెళ్తున్న అటవీ అధికారులు జీపు మూలమలుపు వద్ద ఢీకొట్టి,బోల్తాపడడంతో కిషన్ అక్కడికక్కడే మృతిచెందగా రాజుతోపాటు అటవీశాఖ సిబ్బంది ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.