ETV Bharat / state

'ఆరు నెలల్లోపు పట్టణ ప్రగతి కనిపించాలి'

author img

By

Published : Feb 26, 2020, 4:41 AM IST

Updated : Feb 26, 2020, 7:04 AM IST

మినరల్ కన్నా మిషన్ భగీరథ నీళ్లే మిన్న అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పురపాలికల్లో నెలకొన్న అపరిశుభ్రత పట్ల అందరూ సిగ్గుపడాల్సిందేనని వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించిన మంత్రి అభివృద్ధి ప్రణాళికలపై వార్డుల కమిటీలతో 45 నిమిషాలకుపైగా ప్రసంగించారు.

minister ktr at devarakonda urban development program
'ఆరు నెలలలోపు పట్టణ ప్రగతి కనిపించాలి'

'ఆరు నెలలలోపు పట్టణ ప్రగతి కనిపించాలి'

పారిశుద్ధ్యం, పచ్చదనంపై ఇంటింటికి తిరుగుతూ మహిళలకు శిక్షణనివ్వాల్సిన బాధ్యత పురపాలికల్లోని వార్డుల కమిటీలపై ఉందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. అపరిశుభ్రతకు తావు లేకుండా రాబోయే రోజుల్లో పట్టణాల్ని ఎక్కడికక్కడే సుందరీకరించుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతిలో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండ పురపాలికలో మంత్రి పర్యటించారు. డిండి రహదారిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి... తొమ్మిది, పదో వార్డుల్లోని స్థానికులతో ముచ్చటించి... సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పౌర సేవలే ప్రధాన లక్ష్యం..

పౌరులు కేంద్ర బిందువులుగా, పౌర సేవలే ప్రధాన లక్ష్యంగా నూతన పురపాలక చట్టాన్ని తీసుకువచ్చామని మంత్రి కేటీఆర్​ పునరుద్ఘాటించారు. హక్కుల గురించి ప్రశ్నించినప్పుడు ప్రజలు... బాధ్యతలనూ గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. రానున్న ఆరు నెలల్లో ప్రతి పట్టణంలో మెరుగైన వసతులు కనిపించాలని అధికారులను ఆదేశించారు.

పని చేయకపోతే చర్యలే..

పట్టణ పారిశుద్ధ్యం, నీటి నిర్వహణ, పచ్చదనమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి సూచించారు. పనిచేయని అధికారులపై చర్యలు తీసుకునేలా రూపొందిన నూతన పురపాలక చట్టం... నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రజలనూ వదిలిపెట్టదని హెచ్చరించారు.

దేవరకొండ అభివృద్ధికి రూ.25 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మంత్రిని కోరారు. తాను సూచించిన అభివృద్ధి ఆరు నెలల్లోపు సాక్షాత్కరిస్తే... నిధులు వెంటనే ఇస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:- అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్​లో ఓ గ్రామం!

Last Updated : Feb 26, 2020, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.