ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు తెలంగాణ మీద ప్రేమ పోయింది: కిషన్​రెడ్డి

author img

By

Published : Oct 16, 2022, 7:22 PM IST

Kishan Reddy
Kishan Reddy

Kishan Reddy in munugode bypoll campaign: మునుగోడు ఉపఎన్నిక ప్రచారాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మునుగోడు మండలం కృష్ణపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిషన్​రెడ్డి కేసీఆర్​కు తెలంగాణ మీద ప్రేమ పోయిందని విమర్శించారు. అందుకే టీఆర్​ఎస్​కు వీఆర్​ఎస్​ ఇచ్చి.. బీఆర్​ఎస్​ పేరు పెట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం కాపాలా కుక్కలా ఉంటానని చెప్పిన కేసీఆర్​.. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు.

కేసీఆర్​ టీఆర్​ఎస్​కు వీఆర్​ఎస్​ ఇచ్చి బీఆర్​ఎస్​ పేరు పెట్టారు: కిషన్​రెడ్డి

Kishan Reddy in Munugode Bypoll Campaign: మునుగోడులో ఎన్నికల హోరు రణరంగాన్ని తలపిస్తోంది. ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా కృష్ణపురంలో ప్రసంగించిన కేంద్రమంత్రి కిషన్​రెడ్డి కేసీఆర్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కాపాలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్..​ వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు.

కేసీఆర్‌కు తెలంగాణ అంటే ఇష్టం పోయిందని.. అందుకే పార్టీ పేరులో తెలంగాణ తీసేసి భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం 1,200 మంది ప్రాణత్యాగాలు చేసుకున్నారని.. విద్యార్థులు మంటల్లో కాలిపోతూ జై తెలంగాణ నినాదాలు ఇచ్చింది కేసీఆర్​ కుటుంబం కోసమేనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైన రూ.లక్ష అప్పు ఉందన్న కిషన్​రెడ్డి.. కేసీఆర్​ రూ.5 లక్షల కోట్లు అప్పు చేసి.. దోచుకున్న సొమ్ముతో విమానాలు కొంటున్నారని ఆరోపించారు.

ఖాళీ భూములు కనిపిస్తే తెరాస నేతలు కబ్జా చేస్తున్నారని.. లిక్కర్​ మాఫియా, ఇసుక మాఫియాకు తెరాస తెరలేపిందని కిషన్​రెడ్డి విమర్శించారు. నవాబులా కేసీఆర్​ తరతరాలు పాలించాలని అనుకుంటున్నారని కిషన్​రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి దోచుకుని సొంతంగా విమానాలు కొంటున్నారని.. తెరాస నాయకులు వందల ఎకరాల భూములు దోచుకుంటున్నారన్నారు. తెరాస నేతలు భూ దోపిడీని అడ్డుకుంటే కేసులు పెడుతున్నారని విమర్శించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.