ETV Bharat / state

బీఆర్ఎస్ ఏర్పాటుతో తెలంగాణతో కేసీఆర్‌ బంధం తెగిపోయింది: ఈటల

author img

By

Published : Dec 9, 2022, 1:38 PM IST

Etela Rajender Fires On KCR: సీఎం కేసీఆర్​పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అధికార పార్టీ, ఏపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ తెలంగాణ సెంటిమెంట్​ను లేవనెత్తుతున్నారని దుయ్యబట్టారు. ఈ సెంటిమెంట్‌తో మళ్లీ రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ మోసం చేయలేరని అన్నారు.

Etela Rajender
Etela Rajender

Etela Rajender Fires On KCR: ముఖ్యమంత్రి కేసీఆర్​పై ఈటల రాజేందర్ విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్పినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేరని పేర్కొన్నారు. తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండా మాత్రమేనని చెప్పారు. భరోసా యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు.

బీఆర్ఎస్​ ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణతో కేసీఆర్‌ బంధం తెగిపోయిందని స్పష్టం చేశారు. నల్గొండ నియోజకవర్గంలో ప్రజాగోస- బీజేపీ భరోసా యాత్రలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ, ఏపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి మళ్లీ తెలంగాణ సెంటిమెంట్​ను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. ఈ సెంటిమెంట్‌తో రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ మోసం చేయలేరని ఈటల రాజేందర్ విమర్శించారు.

ఇవీ చదవండి: ఎక్స్​ప్రెస్​ మెట్రోకు శంకుస్థాపన చేసే అర్హత కేసీఆర్‌కు లేదు: కిషన్‌రెడ్డి

'ఆ కొలీజియం సమావేశ వివరాలు ఇవ్వలేం'.. RTI పిటిషన్​ను కొట్టేసిన సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.