ETV Bharat / state

'సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శం'

author img

By

Published : Apr 27, 2020, 10:53 PM IST

సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ.. దేశానికే ఆదర్శమని ఎంపీ రాములు, ఎమ్మెల్యే జనార్ధన్​ రెడ్డి పేర్కొన్నారు.

MP RAMULU AND MLA JANARDHAN REDDY
సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శం

సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టడంలో తెలంగాణ.. దేశంలోనే దిక్సూచిగా మారిందని నాగర్​కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు రాములు, శాసనసభ్యుడు మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ ​కర్నూల్​లో తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు... ఎమ్మెల్యే స్వగృహంలో పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం తెరాస తరఫున ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

తెరాస ఉద్యమ పార్టీగా పురుడు పోసుకొని.. వాటి ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడం ఫలితంగా ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా మారిందన్నారు.

ఇవీ చూడండి: గవర్నర్ తమిళిసైతో భాజపా ప్రతినిధుల బృందం భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.