ETV Bharat / state

'గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి.. గోవధ ఆపాలి'

author img

By

Published : Mar 24, 2021, 7:25 PM IST

few-people-requested-to-save-cow-and-held-a-special-program-for-cow-importance
'గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి.. గోవధ ఆపాలి'

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని నాగర్​ కర్నూల్​ జిల్లాలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. భారతీయ సంస్కృతిలో గోవు ప్రాధాన్యాన్ని వివరించారు. ఏప్రిల్ 1న హైదరాబాద్​లో జరగనున్న గో మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, గోవధను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 1న హైదరాబాద్​లో జరగనున్న గో మహాగర్జన కార్యక్రమానికి నేడు సన్నాహక సమావేశం నిర్వహించారు. భారతీయ సంస్కృతిలో ఆవు ప్రాముఖ్యతను వివరించారు.

గో ఆధారిత సేద్యం, ఆవు వల్ల కలిగే లాభాలను పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు, యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివ కుమార్, డాక్టర్ సురేఖ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్​లో జరగనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఇదీ చదవండి: 'గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే సూర్యాపేట గ్యాలరీ ప్రమాదం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.