ETV Bharat / state

అచ్చంపేటలో జిన్​పింగ్​ దిష్టిబొమ్మ దహనం

author img

By

Published : Jun 22, 2020, 7:45 PM IST

China president Jinping bogle burning at Atchampeta in Nagrkarnool district
అచ్చంపేటలో జిన్​పింగ్​ దిష్టిబొమ్మ దహనం

భారతదేశ సరిహద్దుల్లో చైనా చేసిన దురాగతానికి నిరసనగా ఆ దేశ అధ్యక్షుడు జిన్​పింగ్ దిష్టిబొమ్మను అచ్చంపేటలో దహనం చేశారు. డ్రాగన్​ దేశపు వస్తువులను తక్షణమే ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్​ చేశారు. ఘర్షణలో వీర మరణం పొందిన జవానుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో భారతీయ శివసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చైనా దురాగతాలను ఎండగట్టారు. అనంతరం ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

డ్రాగన్​ దేశపు వస్తువులను తక్షణమే ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్​ చేశారు. చైనా - భారత్ సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన జవానుల ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని కోరారు. వీర జవాన్ల మృతికి కారణమైన చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. భారత సైనికులకు యావద్దేశం తోడుగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.