ETV Bharat / state

Medaram Jatara 2022 : మేడారం జాతరకు కేంద్రం నిధులు

author img

By

Published : Feb 13, 2022, 4:00 PM IST

Updated : Feb 13, 2022, 4:43 PM IST

medaram jatara
medaram jatara

15:58 February 13

మేడారం జాతరకు కేంద్రం నిధులు

Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం ఏర్పాట్ల కోసం 2.5 కోట్లు నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం.. గిరిజన ప్రజల విశిష్ట సంస్కృతి, వారసత్వాన్ని గౌరవిస్తుందని కిషన్​రెడ్డి చెప్పారు. మేడారం జాతరకు కేంద్రం అన్ని విధాల సహకరిస్తుందన్నారు. గిరిజనులకు గుర్తింపునిచ్చేందుకు, జనాభాలో సుమారు 10 శాతం ఉన్న 705 గిరిజన జాతుల వారసత్వం, సంస్కృతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ తెలంగాణవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకునే వివిధ పండుగల కోసం 2.45 కోట్లు మంజూరు చేసినట్లు కిషన్​రెడ్డి తెలిపారు. స్వదేశ్ దర్శన్ పథకం, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గిరిజన సర్క్యూట్‌ల అభివృద్ధిలో భాగంగా 2016-17లోనే దాదాపు 80 కోట్ల రూపాయలతో ములుగు - లక్నవరం - మేడవరం - తాడ్వాయి - దామరవి - మల్లూర్ - బోగత జలపాతాలలో సమగ్ర అభివృద్ధిని చేపట్టినట్లు కిషన్​రెడ్డి తెలిపారు. అందులో భాగంగా మేడారంలో అతిథి గృహం, ఓపెన్ ఆడిటోరియం, పర్యాటకుల కోసం విడిది గృహాలు, తాగునీటి సౌకర్యం, సోలార్ లైట్లు వంటిని ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

ఇదీచూడండి:

Last Updated :Feb 13, 2022, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.