ETV Bharat / state

Medaram Tollgate charges : మేడారం భక్తులపై మరోభారం.. తప్పని 'టోల్' తిప్పలు

author img

By

Published : Feb 14, 2022, 12:17 PM IST

Medaram Tollgate charges : మేడారం జాతరకొచ్చే భక్తులకు టోల్​గేట్ కష్టాలు తప్పట్లేదు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారికి... అదనపు భారం పడుతోంది. జాతర జరిగే నాలుగు రోజుల్లోనైనా... భక్తులకు టోల్ గేట్ భారం లేకుండా చేయాలన్న విజ్ఞప్తులు వ్యక్తమవుతున్నాయి.

Medaram Tollgate charges, medaram jatara 2022
మేడారం భక్తులపై మరోభారం

Medaram Tollgate charges : మేడారం జాతరకొచ్చే భక్తులకు టోల్‌గేట్ ఛార్జీలు అదనపు భారంగా మారుతున్నాయి. హైదరాబాద్ నుంచి మేడారానికి రావాలంటే... యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల, హనుమకొండ జిల్లా హసనపర్తి మండలం కోమటిపల్లి, ములుగు జిల్లా జవహర్‌ నగర్ వద్ద 4 టోల్‌గేట్లు ఎదురవుతాయి. కరీంనగర్ నుంచి వచ్చేవారు మూడుటోల్ గేట్లు దాటాల్సి వస్తోంది. చాలామంది భక్తులు ప్రైవేట్‌వాహనాల్లో వస్తుండటంతో.... నాలుగు నుంచి 500 రూపాయల వరకు టోల్‌ఛార్జీల కిందనే చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే ములుగు జిల్లా జవహర్‌నగర్ వద్ద వారంపాటు... అధికారులు టోల్‌గేట్ రుసం చెల్లింపు నిలిపివేశారు. హైదరాబాద్, కరీంనగర్ మార్గాల్లో టోల్‌గేట్ల వసూళ్లు నిలిపివేస్తే మేడారం మహా జాతరకొచ్చే వారికి కష్టాలు తీరుతాయని భక్తులు చెబుతున్నారు. జాతర జరిగే నాలుగైదు రోజుల్లోనైనా టోల్‌ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు . ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి..!

మరోవైపు మేడారం మహా జాతరకు... ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు... వనదేవతలను దర్శించుకుని ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. బుధవారం నాడు మండమెలిగే పండుగతో... జాతర సందడి మొదలైంది. పూజారులు దిష్టితోరణాలు... కట్టి గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దాదాపు కోటి మంది భక్తులు

మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర... తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని మేడారంలో రెండేళ్లకోసారి అంగరంగవైభవంగా నిర్వహించే మహా గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచింది. ఆసియాలోనే అతి పెద్ద జాతరగా గుర్తింపు పొందిన ఈ వేడుకను చూసి తరించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు దాదాపు కోటిమంది వస్తారని అంటారు.

ఆర్టీసీ స్పెషల్ బస్సులు

ఈ నెల 16 నుంచి 19 వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా 3,845 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ హైదరాబాద్‌, కరీంనగర్‌ జోన్‌ ఈడీ పీవీ మునిశేఖర్‌ తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి ఏసీ బస్సుల్లో ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ చేసుకుని వెళ్లొచ్చు. కేవలం మేడారం వెళ్లేటప్పుడు మాత్రమే రిజర్వేషన్‌ సౌకర్యం ఉంటుంది.. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ముందస్తు బుకింగ్‌ సౌకర్యం ఉండదు. జాతరలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ములుగు రోడ్డులోని ఆర్టీసీ జోనల్‌ స్టాఫ్‌ శిక్షణ కళాశాలలో ఆర్టీసీ డ్రైవర్లకు విడతల వారిగా నిపుణులతో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే హనుమకొండ, వరంగల్‌ బస్టాండ్ల నుంచి మేడారానికి ప్రతి 20 నిమిషాలకో బస్సు నడిపిస్తున్నారు.

సీసీ కెమెరాలు.. డ్రోన్లు..

మేడారంలో బస్టాండు ప్రాంగణం, పార్కింగ్‌ ప్రదేశాల్లో 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మరో 10 పీటీజెడ్‌ కెమెరాలు పెడుతున్నారు. మూడు డ్రోన్లతో పర్యవేక్షించడంతో పాటు 50 వైర్‌లెస్‌ సెట్లు అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్ర సిరొంచతో పాటు ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చే భక్తుల కోసం అంతర్రాష్ట్ర సర్వీసులను నడిపిస్తున్నారు. తాడ్వాయి వద్ద టికెట్ల జారీకి 500 టిమ్‌ యంత్రాలను అందుబాటులో ఉంచారు.

ఇదీ చదవండి: మేడారం మహాజాతర.. గిరిజనుల మహా కుంభమేళా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.