ETV Bharat / state

'ఎందరో మహిళల గురించి విన్నాం... సీతక్కను కళ్లారా చూస్తున్నాం'

author img

By

Published : May 24, 2020, 1:08 PM IST

ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క... భావితరాలకు మార్గదర్శి అని ఆంధ్రప్రదేశ్​ తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి ట్వీట్ చేశారు. కరోనా కష్ట కాలంలో ఆమె గిరిజన గ్రామాలకు కాలి నడకన వెళ్లి నిత్యావసరాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

tdp-senior-leader-somireddy-tweet-on-mla-seethakka-services
'ఎందరో మహిళల గురించి విన్నాం... సీతక్కను కళ్లారా చూస్తున్నాం'

కరోనా కష్టకాలంలో కొండకోనలు దాటి, దారి డొంక లేని గూడాలకు వెళ్లి నిత్యావసర వస్తువులు అందిస్తున్న సీతక్క సేవలు అద్భుతమని... తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి ట్వీట్ చేశారు.

వలస కూలీలకు అండగా నిలిచిన ఆమె తీరు అనిర్వచనీయమని అన్నారు. వివిధ రంగాల్లో సేవలందించి, చరిత్రలో నిలిచిన మహిళల గురించి విన్నాం.. చదివాం.. సీతక్కను కళ్లారా చూస్తున్నాం అని కితాబునిచ్చారు. భావితరాలకు సీతక్క మార్గదర్శి అని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

  • కరోనా కష్టకాలంలో కొండకోనలు దాటి దారిడొంక లేని గూడేలకు వెళ్లి @seethakkaMLA చేస్తున్న సేవ అద్భుతం. వలస కూలీలకు అండగా నిలిచిన తీరు అనిర్వచనీయం. వివిధ రంగాల్లో సేవలందించి చరిత్రలో నిలిచిన మహిళల గురించి విన్నాం.. చదివాం..సీతక్కను కళ్లారా చూస్తున్నాం. భావితరాలకు సీతక్క మార్గదర్శి. pic.twitter.com/H2Cg1LneLG

    — Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) May 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: రాళ్లు, గాజు సీసాలతో దాడి చేసుకున్న వైకాపా కార్యకర్తలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.