ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన పెను ప్రమాదం

author img

By

Published : Jul 16, 2022, 4:14 PM IST

ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన పెను ప్రమాదం
ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన పెను ప్రమాదం ()

mla seethakka: ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న పడవలో పెట్రోల్​ అయిపోవడంతో వాగు మధ్యలో నిలిచిపోయింది. సీతక్క సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

mla seethakka: ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పెను ప్రమాదం తప్పింది. ముంపు ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి తిరిగి వస్తుండగా సీతక్క ప్రయాణిస్తున్న పడవలో పెట్రోల్​ అయిపోయింది. దీంతో పడవ వాగు మధ్యలో ఓ చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. అనంతరం వాగు ఉద్ధృతికి ఒడ్డుకు కొట్టుకువచ్చింది.

అప్రమత్తమైన అధికారులు సీతక్కను పడవలో నుంచి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. సీతక్కతో పాటు పడవలో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించారు. ఏటూరు నాగారం మండలం ఎలిశెట్టిపెల్లి వాగులో ఈ ఘటన చోటుచేసుకుంది.

పడవ నుంచి కిందకు దిగుతున్న ఎమ్మెల్యే సీతక్క
పడవ నుంచి కిందకు దిగుతున్న ఎమ్మెల్యే సీతక్క

ఇవీ చూడండి..

భద్రాద్రిలో రేపు గవర్నర్​ పర్యటన.. సీఎం కేసీఆర్​ ఏరియల్​ సర్వే..

బాసర ఘటనపై సర్వత్రా విమర్శలు.. మంత్రిని బర్తరఫ్​ చేయాలని డిమాండ్​

డీజిల్ ట్యాంకర్ బోల్తా.. ఇంధనం కోసం ఎగబడ్డ వాహనదారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.