MLA Seethakka : ఉద్యోగుల పాలిట యమపాశంగా 317జీవో: సీతక్క

author img

By

Published : Jan 12, 2022, 4:16 PM IST

MLA Seethakka,  congress protest

MLA Seethakka : జీవో 317 ఉద్యోగుల పాలిట యమపాశంగా మారిందని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. రోస్టర్ విధానం పాటించకుండానే రూల్ ఆఫ్ రిజర్వేషన్​కు ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. తెలంగాణ ఎన్ఎస్​యూఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

MLA Seethakka : ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. తెలంగాణ ఎన్ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో... హైదరాబాద్ ట్యాంక్ బండ్​పై చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే సీతక్క, బల్మూరి వెంకట్​ను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేసి... నాంపల్లి పోలీసు స్టేషన్​కు తరలించారు.

సీతక్క ఫైర్

పోలీసుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ... పోలీసు స్టేషన్​లోనూ సీతక్క ఆందోళన కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317జీవో ఉద్యోగుల పాలిట యమపాశంగా మారిందని... రికార్డ్ చేసిన ఆదివాసి ఉద్యోగులకు స్థానికంగానే బదిలీల ప్రాధాన్యత కల్పించాలని కోరారు. రోస్టర్ విధానం పాటించకుండానే రూల్ ఆఫ్ రిజర్వేషన్​కు ప్రభుత్వం తూట్లు పొడిచిందని సీతక్క విమర్శించారు.

హైదరాబాద్​లో సీతక్క నిరసన

'ఉద్యోగులను, వాళ్ల కుటుంబాలను మానసిక వేదనకు గురి చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి... ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన బదిలీలు చేపట్టాలని కోరుతున్నాం. జూనియర్లకు అటవీ ప్రాంతంలో... సీనియర్లకు ప్లేన్ ఏరియాలకు బదిలీ చేస్తున్నారు. గిరిజన ప్రాంతానికి చెందిన ఉద్యోగిని హైదరాబాద్​కు తీసుకొస్తే వారు ఎలా అడ్జస్ట్ అవుతారు. జూనియర్లను అటవీ ప్రాంతానికి వస్తే కొత్త పోస్టులకు ఖాళీలు ఏర్పడవు. మరి అక్కడ చదువుకున్న వాళ్లు ఏం అవుతారు? రిక్రూట్​మెంట్ అంతా ఒకవైపు, రిటైర్​మెంట్ అంతా ఒకవైపు అవుతారు. ఉద్యోగులతో చర్చలు జరపాలి. జీవో 317ను రద్దు చేయాలి. ప్రశ్నిస్తే ప్రజా గొంతుకలు నొక్కేస్తున్నారు.'

-సీతక్క, ములుగు ఎమ్మెల్యే

ప్రాణాలతో చెలగాటం

ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్న జీవో 317 ను రద్దు చేయాలని... తెరాస, భాజపా డ్రామాలను ఆపాలని డిమాండ్ చేశారు. మల్టీ జోనల్ పోస్టుల నిర్ణయాల విషయంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన బదిలీలను చేపట్టాలని కోరారు. రాష్ట్రపతి జీవో నంబర్ 317 ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానికత ఆధారంగా రిక్రూట్​మెంట్ అయిన ఉద్యోగులకు స్థానికంగానే భద్రత కల్పించాలని... జోనల్, మల్టీ జోనల్ జిల్లాల సర్దుబాటు చేయాలని కోరారు. ఉద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వంపై పోరాటం చేయాలని... వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందన్నారు.

'రైతుబంధు సంబురాలు చేసుకుంటున్నారు. ఎందుకు? వడ్లలో క్వింటాకు 10-12 కేజీలను మిల్లర్లు కోసుకుంటున్నారు. ఎరువుల ధరలు పెంచారు. పట్టా ఉంటేనే పెట్టుబడి అంటిరి. మరి వారికి గిట్టుబాటు ధర ఎలా లభిస్తుంది. ఇవాళ వందలాది ఎకరాల భూమి ఉండి.. వ్యవసాయంతో సంబంధంలేనివారికి సంబురాలు. ఎందుకంటే వారు పెట్టుబడి పెట్టేది లేదు కదా.'

-సీతక్క, ములుగు ఎమ్మెల్యే

ఇదీ చదవండి: Telangana Rains : రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.