ETV Bharat / state

బియ్యం గింజతో అద్భుతం..

author img

By

Published : Feb 7, 2020, 3:23 PM IST

మనం తినే ప్రతి గింజపై మన పేరుంటుందనే నానుడి.. అదే బియ్యం గింజపై మన పేరును అందంగా చెక్కి ఓ కళాకండంలో బందిస్తే అద్భుతంగా కనిపిస్తుంది.. ఇదే కళ ఇప్పుడు మేడారం జాతరలో ఓ కళాకారునికి ఉపాధిగా మారింది.

Awesome rice name art at medaram jatara mulugu
బియ్యం గింజతో అద్భుతం..

జనసంద్రంగా ఉండే మేడారం జాతరతో పలువురు చిరు వ్యాపారులు, కళాకారులకు ఉపాధి లభిస్తోంది. ఈ సందర్భంగా బియ్యపు గింజలపై అందంగా పేర్లు రాసి వాటిని తమకు నచ్చిన కీ చైన్లలో అమర్చి అమ్ముతున్నారు. బియ్యం గింజపై కళాకారుడు రాస్తున్న ప్రతిభ అందరినీ ఆకర్షిస్తుంది.

డ్రాయింగ్ ఇంక్, అతి సన్నని బ్రెష్​ని ఉపయోగించి నచ్చిన పేర్లను, ఇష్టమైన గుర్తులను అందంగా వివిధ రకాల కీచైన్లపై లిఖించి ఇస్తున్నాడు. వీటి ధర కూడా ఎంపికను బట్టి రూ. 30 నుంచి రూ. 150 లోపే ఉంది. జాతరకు వచ్చిన వారు తమను పేర్లను ఇలా రాయించుకొని వాటిని చూసి మురిసిపోతున్నారు.

బియ్యం గింజతో అద్భుతం..

ఇదీ చూడండి : మేడారం జాతరలో కిడ్నాప్ ముఠాలు.. మీ పిల్లలు జాగ్రత్త..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.