ETV Bharat / state

'మహిళలకు మెరుగైన వైద్య సేవలందించాలి'

author img

By

Published : Mar 6, 2021, 6:53 PM IST

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానాన్ని కల్పిస్తుందని మేడ్చల్​ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాచుపల్లిలోని ఎస్​ఎల్​జీ ఆస్పత్రిలో సఖీ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ సెంటర్​ను ఆమె ప్రారంభించారు.

sakhi well being health center opened by nizampet municipal corporation chairman neela gopal reddy  at bachupally in medchal district
'మహిళలకు మరింత మెరుగైన వైద్య సేవలందించాలి'

మహిళల కోసం ప్రత్యేకంగా హెల్త్​ సెంటర్లు ప్రారంభించడం శుభ పరిణామమని మేడ్చల్​ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాచుపల్లిలోని ఎస్​ఎల్​జీ ఆస్పత్రిలో సఖీ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ సెంటర్​ను ఆమె ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానాన్ని కల్పిస్తుందని ఆమె అన్నారు. మహిళల్లో వచ్చే క్యాన్సర్లు నిర్ధారించుకునే పద్ధతులను వివరిస్తూ ఆస్పత్రి వైద్యులు ఏర్పాటుచేసిన ప్రదర్శనను సందర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని నీలా గోపాల్​ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఛైర్మన్ దండు శివరామరాజు, ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోమరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఆర్​ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.65లక్షలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.