ETV Bharat / state

'పేద బ్రాహ్మణులందరూ రేషన్​ కార్డు తీసుకోవాలి'

author img

By

Published : May 23, 2020, 2:12 PM IST

పేద బ్రాహ్మణులందరూ తెల్ల రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారులు రమణాచారి సూచించారు. కూకట్​పల్లిలో వేద ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో కూకట్​పల్లిలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ramachari said All poor Brahmins should take ration card
'పేద బ్రాహ్మణులందరూ రేషన్​ కార్డు తీసుకోవాలి'

లాక్​డౌన్ నేపథ్యంలో ఆలయాలు మూతపడి బ్రాహ్మణులకు పూట గడిచే పరిస్థితి లేకుండా మారింది. ఈ నేపథ్యంలో కూకట్​పల్లిలో వేద ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో 200 మంది నిరుపేద బ్రాహ్మణులకు నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, ధార్మిక సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమాచారి పాల్గొన్నారు.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా వేద బ్రాహ్మణులు అందరూ లబ్ది పొందాలని రమణాచారి, వేణుగోపాలచారిలు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్రాహ్మణుల పిల్లల చదువులకు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు సహాయం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు ప్రతి పేద బ్రాహ్మణులు తెల్ల రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని రమణాచారి సూచించారు. దాతలు ముందుకొచ్చి తమకు తోచినంతలో ఇతరులకు సహాయం చేయాలన్నారు.

'పేద బ్రాహ్మణులందరూ రేషన్​ కార్డు తీసుకోవాలి'

ఇదీ చూడండి : 'వరకట్నం కోసం వేధించారు... చివరకు చంపేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.