ETV Bharat / state

రహదారిపై ఎమ్మెల్యే హన్మంతరావు నిరసన

author img

By

Published : Mar 3, 2021, 8:38 PM IST

మేడ్చల్​ జిల్లా కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ వద్ద రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూసేసిన సర్వీస్ రోడ్డును తిరిగి ప్రారంభించాలని డిమాండ్​ చేస్తూ.. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రోడ్డుపై నిరసన చేపట్టారు.

MLA Hanmantrao protests on the road in kompalli medchal
రహదారిపై ఎమ్మెల్యే హన్మంతరావు నిరసన

మేడ్చల్​ జిల్లా కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ వద్ద రహదారిపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆందోళన చేపట్టారు. సుచిత్ర నుంచి కొంపల్లికి వెళ్లే దారిలో.. యూటర్న్ తీసుకోవడానికి 3 కి.మీ వెళ్లాల్సి వస్తోందని మండిపడ్డారు. మూసేసిన సర్వీస్ రోడ్డును తిరిగి ప్రారంభించాలని ఆయన డిమాండ్​ చేశారు.

యూటర్న్​పై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ.. రెండు రోజుల్లో దానిని తొలగిస్తామని చెప్పడంతో వివాదం సద్దు మణిగింది.

ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలకు ఎవరు బాధ్యులు: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.