ETV Bharat / state

మున్సిపల్ ఛైర్మన్​ను పరామర్శించిన హరీశ్​రావు

author img

By

Published : Feb 4, 2021, 10:19 PM IST

కరోనా సోకిన మున్సిపల్ ఛైర్మన్​ మురళి యాదవ్​ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు పరామర్శించారు. మెదక్​ జిల్లా నర్సాపూర్​లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు.

minister harish rao consolates  the narsapur municipal chairman today
మున్సిపల్ ఛైర్మన్​ను పరామర్శించిన హరీశ్​రావు

మెదక్​ జిల్లా నర్సాపూర్​ పురపాలక ఛైర్మన్ మురళి యాదవ్​ను మంత్రి హరీశ్​రావు పరామర్శించారు. ఆయనకు కరోనా సోకడంతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు నర్సాపూర్​లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్యంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

వైద్యుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రితోపాటు మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి, దేవేందర్​ రెడ్డి, డీసీసీబీ చిట్టి దేవేందర్​ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి : సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడే... కానీ అదొక్కటే నెగిటివ్: జీవన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.