ETV Bharat / state

Kodandaram:'రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి'

author img

By

Published : Mar 16, 2022, 7:11 PM IST

Kodandaram: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఉద్యోగాల భర్తీపై జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలోని టీఎన్జీవో భవన్​లో జిల్లా స్థాయి రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు హాజరయ్యారు.

kodandaram
కోదండరాం

Kodandaram: ప్రజల సంక్షేమంపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ధ్వజమెత్తారు. మెదక్ పట్టణంలోని టీఎన్జీవో భవన్​లో జిల్లా స్థాయి రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ​

'ప్రభుత్వం ప్రశ్నించే నేతలను జైల్లో పెడుతుంది. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని అడిగితే అరెస్ట్ చేసి స్టేషన్​కు పంపడం దారుణం. మల్లన్నసాగర్ రైతులు న్యాయం చేయమని అడిగినందుకు ఆ గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టారు. ప్రజల సంక్షేమంపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవడమంటేనే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం.'

-కోదండరాం, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు

అదే విధంగా ఈ సదస్సుకు హాజరైన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్​ మాట్లాడారు. రాజ్యంగాన్ని మార్చాలన్న కేసీఆర్​ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. అంబేడ్కర్​ రాసిన రాజ్యాంగం ఎంతో గొప్పదని దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఇదీ చదవండి:టీఎస్‌పీఎస్సీ ముట్టడికి ఎన్​ఎస్​యూఐ యత్నం.. గాంధీభవన్​ వద్ద ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.