ETV Bharat / state

student strike at kannepalli: 'మా టీచర్లు మాకే కావాలి'

author img

By

Published : Oct 5, 2021, 5:56 PM IST

student strike at kannepalli, deputation process in telangana
విద్యార్థుల ధర్నా, డిప్యూటేషన్​పై విద్యార్థుల ఆగ్రహం

'మా టీచర్లు మాకే కావాలి' అంటూ కన్నెపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను డిప్యూటేషన్​పై వేరే పాఠశాలకు పంపడంపై ఆందోళన(student strike at kannepalli) చేపట్టారు. అధికారులు ఈ డిప్యూటేషన్(teachers deputation process in telangana) నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి ప్రాథమిక పాఠశాల ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యుటేషన్​పై(teachers deputation process in telangana) వేరే పాఠశాలకు పంపడం ఆపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ... విద్యార్థులు, తల్లిదండ్రులు జాతీయ రహదారిపై ధర్నా(student strike at kannepalli) చేపట్టారు. ఆ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఏడు తరగతుల్లో మొత్తం 70 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా... సర్దుబాటు చేసే పక్రియలో భాగంగా ఇద్దరిని రెబ్బనపల్లి పాఠశాలకు డిప్యూటేషన్​పై పంపించడానికి ఆర్డర్స్ ఇచ్చారు.

student strike at kannepalli, deputation process in telangana
విద్యార్థుల ధర్నా, డిప్యూటేషన్​పై విద్యార్థుల ఆగ్రహం

ఎంఈవో స్పందన

ఈ విషయం తెలుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల చదువులకి ఇబ్బంది కలగకుండా చూడాలని స్థానిక జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయులను పాఠశాల గదిలో బంధించి.. తాళం వేసి నిరసన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని... డిప్యూటేషను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుకున్న స్థానిక మండల విద్యాధికారి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు పరిస్థితిని వివరించారు. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నందున ఉపాధ్యాయులను డిప్యూటేషన్​ పై(teachers deputation process in telangana) వేరే పాఠశాలకు కేటాయించారని వివరించారు. మొత్తం విద్యార్థుల వివరాలు ఆన్​లైన్​లో నమోదు అయ్యాక... ఆ టీచర్ల డిప్యూటేషన్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన(student strike at kannepalli) విరమించారు.

farmers strike in sirikonda, farmers protest in rajanna sircilla district
సిరికొండలో అన్నదాతల ఆందోళన

మా కన్నెపల్లి యూపీఎస్ స్కూల్​లో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్​పై వేరే పాఠశాలకు పంపించారు. ఇదిచాలా బాధాకరమైన విషయం. ఎక్కువ మంది లేరని వేరే పాఠశాలకు బదిలీ చేశారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 70మంది విద్యార్థులు ఉన్నారు. సర్పంచ్​, గ్రామస్థులు కలిసి 30 మంది విద్యార్థులను ఈ ఏడాది స్కూల్​లో చేర్పించాం. బడి మంచిగా పనిచేసే సమయంలో ఇద్దరు టీచర్లను బదిలీ చేయడం బాధాకరమైన విషయం. మేమంతా ఎంఈవో, డీఈవోలను సంప్రదించాం. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే నిరసనగా ఉపాధ్యాయులను తరగతి గదిలో బంధించాం. ఈ ఆందోళన చేపట్టాం.

-గ్రామస్థులు

ఇదీ చదవండి: dead body found in hyderabad: కుత్బుల్లాపూర్‌లో నాలాలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.