ETV Bharat / state

అమ్మ పాఠశాలలో చదివి... సివిల్స్​ కొట్టాడు..

author img

By

Published : Aug 4, 2020, 8:16 PM IST

కన్నతల్లి పాఠశాలలోనే చిన్నతనం నుంచి పది వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సివిల్స్ సాధించి సత్తా చాటాడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన యువకుడు.

special story on civils ranker holder Shirishetti Sankirt
అమ్మ పాఠశాలలో చదివి... సివిల్స్​ కొట్టాడు..

యూపీఎస్సీ ఫలితాల్లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన శిరిశెట్టి సంకీర్త్ 330వ ర్యాంకు సాధించాడు. మూడుసార్లు విఫలమైన వెనక్కు తగ్గకుండా నాలుగోసారి లక్ష్యాన్ని చేరుకున్నాడు. చిన్నప్పటి నుంచి తల్లి నిర్వహిస్తున్న పాఠశాలలోనే పది తరగతి వరకు చదివాడు.

తండ్రి సత్యనారాయణ సింగరేణిలో ఎలక్ట్రికల్​గా, తల్లి ప్రైవేట్ పాఠశాలకు ప్రిన్సిపల్​గా పని చేస్తున్నారు. సివిల్స్​లో ర్యాంకు రావడంతో సంకీర్త్ సంతోషం వ్యక్తం చేశాడు.

ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.