ETV Bharat / state

వర్షాల కారణంగా ఉపరితల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

author img

By

Published : Aug 8, 2019, 1:09 PM IST

మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉపరితల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గత రెండు రోజులు పనులు నడవక పోవడం వల్ల సుమారు 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

వర్షాల కారణంగా ఉపరితల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని ఆర్‌కేపీ ఉపరితల గనితో పాటు శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్‌పీ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్‌ కాస్ట్‌లోకి వరద నీరు చేరడం కారణంగా మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రెండు రోజుల్లో సుమారు 40 వేల టన్నులు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వర్షాల కారణంగా ఉపరితల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

ఇవీ చూడండి: ఇకపై వ్యవసాయానికి మాత్రమే వ్యవసాయ రుణాలు

Intro:Tg_adb_21_08_oc lo varsham_avb_TS10081ఓసిBody:Tg_adb_21_08_oc lo varsham_avb_TS10081ఓసి లో రెండో రోజు నిలిచిన బొగ్గు ఉత్పత్తి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కళ్యాణాని, ఆర్ కే పి ఉపరితల గనులతో పాటు శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్ పి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓసి లోకి వరద నీరు చేరడం కారణంగా మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. రెండు రోజుల్లో సుమారు 40 వేల టన్నులు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.Conclusion:పేరు సారం సతీష్ కుమార్ జిల్లా మంచిర్యాల నియోజకవర్గం చెన్నూర్, ఫోన్ నెంబర్ 9 4 4 0 2 3 3 8 3 1

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.