ETV Bharat / state

జనావాసాల్లోకి దుప్పి.. రక్షించిన స్థానికులు

author img

By

Published : Jun 11, 2021, 9:43 AM IST

deer, mancherial
మంచిర్యాలలో దుప్పి, చుక్కల దుప్పి

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో చుక్కల దుప్పి ప్రత్యక్షమైంది. వీధి కుక్కలు వెంటపడగా స్థానికులు రక్షించారు. వెంటనే అప్రమత్తమైన అటవీ అధికారులు దుప్పిని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపరిధిలోని జ్యోతి నగర్​లో చుక్కల దుప్పి కలకలం సృష్టించింది. వీధి కుక్కలు వెంటపడి రావడంతో స్థానికులు రక్షించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని వైద్య చికిత్స కోసం దుప్పిని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

గాంధారి వనం డీర్ పార్కుకు దుప్పిని తరలిస్తామని అటవీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, స్థానికులు రాముడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Viral: ఈ బుడతడు.. డ్యాన్స్​తో అదరగొట్టాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.