ETV Bharat / state

'వారివి నాణ్యమైన ఉత్పత్తులే.. కానీ మార్కెటింగ్ లేదు'

author img

By

Published : May 30, 2020, 11:45 AM IST

మహబూబ్​నగర్ జిల్లా​లోని స్వయం సహాయక మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులు ఎగుమతి కావాలని... ఇందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు.

'వారివి నాణ్యమైన ఉత్పత్తులే.. కానీ మార్కెటింగ్ లేదు'
'వారివి నాణ్యమైన ఉత్పత్తులే.. కానీ మార్కెటింగ్ లేదు'

పాలమూరు జిల్లా స్వయం సహాయక సంఘం మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను, అమ్మకాలను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు​తో కలిసి ప్రారంభించారు. అనంతరం స్టాళ్లను, ఉత్పత్తులను పరిశీలించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సంఘాలకు వడ్డీ లేని రుణాలిచ్చామని మంత్రి గుర్తు చేశారు. మహిళా సంఘాలు నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నా.. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక లాభపడట్లేదని మంత్రి అన్నారు. సరైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

1000 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ !

త్వరలోనే మహబూబ్​నగర్​లోని వెయ్యి ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్​ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళా సంఘాలు మంచి ఉత్పత్తులను తయారు చేయాలని, వాటిని ఫుడ్ పార్కులో మార్కెటింగ్ చేసేందుకు అవసరమైన స్థలం కేటాయిస్తామని పేర్కొన్నారు. ఆర్గానిక్ ఫుడ్ సెంటర్​ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు 'మహా' పేరును నామకరణం చేసి లోగోను ఆవిష్కరించారు.

జిల్లాకే పరిమితం చేయొద్దు...

పాలమూరులో తయారైన మహబూబ్ నగర్ మహిళా ప్రొడక్ట్స్​ను జిల్లా వరకే పరిమితం చేయకుండా.. ప్రపంచానికి పరిచయం చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మామిడి ఒరుగు చేసిన విధంగానే రాబోయే సీజన్లో సీతాఫలం యూనిట్లను హన్వాడ, గండీడ్, నవాబు పేట్ మండలాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఇవీ చూడండి : లాక్​డౌన్​ 5.0 రూల్స్​పై రాష్ట్రాల మాటే ఫైనల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.