ETV Bharat / state

ఆలయ భూమిలో రైతు వేదిక.. పోలీసులకు ఫిర్యాదు

author img

By

Published : Jul 28, 2020, 11:23 AM IST

దేవాదాయ శాఖ భూములు కనిపిస్తే చాలు ఆక్రమించుకొని... నిర్మాణాలు చేపట్టడం పరిపాటిగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లా బలిగెరలో ఆలయ భూమిలో అనుమతి లేకుండా రైతు వేదిక నిర్మాణం చేపడుతున్నారంటూ... దేవాదాయ శాఖ అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

raithu vedika construction in baligera endowment lands
ఆలయ భూమిలో రైతు వేదిక.. పోలీసులకు ఫిర్యాదు

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బలిగెరలో హనుమాన్ ఆలయానికి సంబంధించిన... 225, 519 సర్వే నంబర్లలలో 29.19 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల్లో సగం వరకూ ఇప్పటికే అన్యాక్రాంతమైంది. తాజాగా ఆలయ భూముల్లో రైతు వేదిక నిర్మాణం చేస్తున్నారని... ఆ నిర్మాణాన్ని ఆపాలంటూ... రెవిన్యూ అధికారులకు ఆలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. రైతు వేదిక నిర్మాణం కోసం సర్వే నంబర్ 524లో 20 గుంటల భూమిని కేటాయించామని తహసీల్దార్ ఆలయ అధికారులకు తెలిపారు. రెవిన్యూశాఖ కేటాయించిన స్థలంలో కాకుండా ఆలయ స్థలంలో నిర్మాణం చేపట్టడం... వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే అన్యాక్రాంతమైన భూములను దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతుంటే... ఉన్న భూమినికి కనీసం శాఖ దృష్టికి తీసుకురాకుండా, అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం, అదీ ప్రభుత్వ భవన నిర్మాణం చేపట్టడం చర్చనీయాంశం అవుతోంది.

కోట్లలో...

గద్వాల నుంచి రాయచూరుకు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకునే ఈ భూములున్నాయి. మొత్తం 29 ఎకరాల భూముల విలువ కోట్లలో ఉంటుంది. అలాంటి భూముల్లో నిర్మాణం చేసేటప్పుడు... సంబంధిత శాఖ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా గట్టు మండల తహశీల్దార్, ఎంపీడీఓలు స్పందించి... రైతు వేదిక నిర్మాణాన్ని ఆపాలని దేవాదాయశాఖ అధికారులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఎస్పీ సహా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు.

శాఖ అనుమతి తప్పనిసరి

ఏ శాఖ భూమినైనా వారి నుంచి స్వాధీనం చేసుకుని.. ఏ శాఖ నిర్మిస్తుందో వారికి బదలాయించి ఆ తర్వాతే ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఈ అధికారిక ప్రక్రియను విస్మరించి... స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల సూచన మేరకు ఏకంగా నిర్మాణ పనులే చేపట్టడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ అక్రమ నిర్మాణం చేస్తున్న ప్రాంతాన్ని ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శ్రీనివాస రాజు, డిప్యూటీ ఇన్​స్పెక్టర్ వెంకటేశ్వరి పరిశీలించారు. తమ శాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు.

ఆలయ భూమిలో రైతు వేదిక.. పోలీసులకు ఫిర్యాదు

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.