అధికారంలోకి రాగానే చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తేస్తాం: రాహుల్‌ గాంధీ

author img

By

Published : Oct 28, 2022, 6:11 PM IST

Rahul Gandhi Bharat Jodo Yatra
Rahul Gandhi Bharat Jodo Yatra ()

Rahul Gandhi on Handloom Garments GST: మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర కొనసాగుతోంది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆయనతో చేనేత, పోడు రైతు ప్రతినిధులు భేటీ అయ్యారు. పోడు భూములు, చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్‌ గాంధీతో వారు చర్చించారు.

Rahul Gandhi on Handloom Garments GST: దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జోడో యాత్రలో ఉన్న రాహుల్‌ను చేనేత రంగం ప్రతినిధులు, పోడు రైతు ప్రతినిధుల బృందం కలిసింది. మధ్యాహ్న భోజన సమయంలో ఆయనకు తమ సమస్యలు విన్నవించారు. ఇందిరమ్మ హయాంలో తమకు ఇచ్చిన భూములను గుంజుకుంటున్నారని గిరిజన సంఘాల ప్రతినిధులు రాహుల్‌కు ఫిర్యాదు చేశారు.

అటవీ ప్రాంతాల్లో దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలు పరిష్కరించడంతో పాటు భూమి పట్టాలు అందజేసి శాశ్వతంగా హక్కులు కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. భారతదేశంలో కీలక వ్యవసాయ రంగం.. తర్వాత అతి పెద్ద చేనేత రంగంపై ప్రజలు ఆధారపడి జీవిస్తున్న దృష్ట్యా వస్తువులపై జీఎస్టీ ఎత్తివేసేలా చూడాలని నేతన్నలు రాహుల్‌ను కోరారు.

ఇవీ చదవండి: తెరాస, భాజపాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి: రాహుల్​ గాంధీ

'దేశంలో పోలీసులందరికీ ఇక ఒకే యూనిఫాం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.