ETV Bharat / state

'బీజేపీ బీఆర్​ఎస్​లకు బీసీలకు అధికారం ఇవ్వడం నచ్చదు అందుకే కుల గణనకు రెండు పార్టీలు ఒప్పుకోవడం లేదు'

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2023, 7:31 PM IST

Rahul Gandhi in Vijayabheri bus Yatra at Jadcherla : కాంగ్రెస్​ పార్టీ దేశంలోనూ, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఓబీసీ కులగణనకు తొలి ప్రాధాన్యత ఇస్తామని ఆ పార్టీ​ అగ్రనేత రాహుల్​ గాంధీ స్పష్టం చేశారు. ఓబీసీల శక్తి ఏంటో తెలుస్తుందన్న కారణంతోనే జనగణనకు బీజేపీ, బీఆర్​ఎస్​ అంగీకరించడం లేదని విమర్శించారు. జడ్చర్లలో జరిగిన కాంగ్రెస్​ విజయ భేరి బస్సు యాత్రలో రాహుల్​ పాల్గొని ప్రసంగించారు.

Vijayabheri bus yatra at Jadcherla
Rahul Gandhi in Vijayabheri bus yatra at Jadcherla

Rahul Gandhi in Vijayabheri bus Yatra at Jadcherla : దేశంలో, తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే.. ఓబీసీ జనగణన(OBC Sensus in India)కు తొలి ప్రాధాన్యం ఇస్తామని కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. ఓబీసీల శక్తి ఏంటో తెలుస్తుందన్న కారణంతోనే జనగణనకు బీజేపీ, బీఆర్​ఎస్​ అంగీకరించడం లేదని విమర్శలు చేశారు. జడ్చర్లలో జరిగిన కాంగ్రెస్​ విజయభేరి బస్సు యాత్ర(Congress Bus Yatra in Telangana)లో రాహుల్​ పాల్గొని.. బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

దేశాన్ని నడిపించడంలో ఓబీసీల పాత్ర ఎంతో ఉందని రాహుల్​ గాంధీ అన్నారు. దేశంలో బీసీలు, ఆదివాసీలు, దళితులు ఎంతమంది ఉన్నారంటే ఎవరూ చెప్పలేరని తెలిపారు. దేశాన్ని రాజ్యసభ, లోక్​సభ సభ్యులు నడపరని.. పాలన మొత్తాన్ని 90 మంది ఐఏఎస్​ అధికారులు మాత్రమే నడుపుతున్నారన్నారు. ఏ శాఖకు ఎన్ని నిధులివ్వాలన్నది వాళ్లే నిర్ణయిస్తారని వివరించారు.

DK Shivakumar Speech in Congress Bus Yatra : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ పట్ల కృతజ్ఞత చూపాలి : డీకే శివకుమార్​

Rahul Gandhi Wants to Do OBC Sensus in India : ఆ 90 మందిలో ఓబీసీలు, దళితులు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. దేశాన్ని నడపడంలో బీసీ, దళితులు, ఆదివాసీల భాగస్వామ్యం లేదా అంటూ ప్రశ్నించారు. ఆ 90 మందిలో ఓబీసీ అధికారులు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారని.. 5 శాతం బడ్జెట్​ మాత్రమే బీసీలకు కేటాయిస్తున్నారని విమర్శించారు. అందుకే బీసీల జనగణన జరగాలని డిమాండ్​ చేస్తున్నామన్నారు.

అందుకే దేశంలో ఎంతమంది ఓబీసీలు, గిరిజనులు, మైనారిటీలు ఉన్నారో తేలాలని రాహుల్​ గాంధీ వివరించారు. బీజేపీ, బీఆర్​ఎస్​లకు ఓబీసీలకు అధికారం ఇవ్వడానికి ఇష్టపడటం లేదని మండిపడ్డారు. అందుకే కులగణనను రెండు పార్టీలు ఒప్పుకోవడం లేదని విమర్శించారు. నరేంద్ర మోదీ, కేసీఆర్​లు ఎమ్మెల్యే, ఎంపీల మాట వినరని రాహుల్​ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా కొద్ది మంది అధికారులే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు.

Congress Vijaya Bheri in Kalwakurthi : అంతకు ముందు కల్వకుర్తిలో జరిగిన కాంగ్రెస్​ విజయభేరి సభ(Congress Vijayabheri Sabha)లో రాహుల్​ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు శాతం ఓట్లు రాని బీజేపీ.. బీసీ నేతను ఎలా సీఎం చేస్తుందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్​ కుటుంబం రూ.లక్ష కోట్లను దోచుకుందని ఆరోపించారు. ధరణి పోర్టల్​ను తీసుకొచ్చి.. పేద ప్రజల భూములను లాక్కున్నారని విమర్శించారు.

Rahul Gandhi Speech at Kalwakurthy : కేసీఆర్‌ లూటీ చేసిన సొమ్మంతా వసూలు చేసి ప్రజలకు పంచుతాం : రాహుల్​గాంధీ

Rahul Gandhi Speech at Kollapur Meeting : 'కాంగ్రెస్‌ వస్తే రైతుబంధు నిలిచిపోతుందనేది దుష్ప్రచారం.. కౌలు రైతులకూ రైతు భరోసా ఇస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.