ETV Bharat / state

BJP MLA Tickets Mahabubnagar 2023 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ టికెట్‌ కోసం టఫ్ ఫైట్‌.. మరో ఛాన్స్ ఇవ్వాలంటున్న పలువురు నేతలు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 8:40 AM IST

Telangana Assembly Election 2023
Telangana BJP Latest News

BJP MLA Tickets Mahabubnagar 2023 : వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరంటూ బీజేపీపై మిగతా పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న వేళ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. గత ఎన్నికల్లో ఎన్నికల బరిలో దిగిన నాయకులు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతుండగా.. ఇటీవలే కాషాయ తీర్థం పుచ్చుకున్న వాళ్లూ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. పూర్వ పాలమూరులో బలంగా ఉన్న బీఆర్ఎస్-కాంగ్రెస్‌కు ధీటుగా గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం పార్టీకి సవాలుగా మారనుంది.

Competition For BJP MLA Tickets ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 స్థానాల్లో పోటీకి నేతల ఆసక్తి

BJP MLA Tickets Mahabubnagar 2023 : వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే దూసుకుపోతోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థులంతా దరఖాస్తు చేసుకోగా.. అవి ఎన్నికల కమిటీ పరిశీలనలో ఉన్నాయి. భారత్‌ రాష్ట్ర సమితి, హస్తం పార్టీ బలంగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో.. బోణీ కొట్టాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.

Telangana BJP MLA Tickets Applications 2023 : మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి పోటీ చేసేందుకు (BJP MLA Tickets).. చాలా మందే దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ అభ్యర్థులకు.. దీటుగా గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం బీజేపీకి సవాలుగా మారనుంది. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాకుల బాలరాజ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, పార్లమెంటరీ ప్రచార కార్యదర్శి ముత్యాల తిరుపతిరెడ్డి దరఖాస్తులిచ్చారు.

'మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ప్రధాని మోదీ పోటీ చేయాలి'

BJP MLA Tickets Fight 2023 : మహబూబ్‌నగర్​లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్(Minister Srinivas Goud) ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం కావడంతో అందుకు ధీటైనా అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్‌ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, బాలత్రిపురసుందరితోపాటు మరో 10 మంది పోటీపడుతున్నారు. దేవరకద్ర నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కమలం అభ్యర్థిగా పోటీ చేసిన ఎగ్గని నర్సింహులుతోపాటు మరో ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు.

Competition For BJP MLA Tickets in Narayanpet District : నారాయణపేట జిల్లాలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. నారాయణపేట నియోజకవర్గం నుంచి గతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రతంగ్ పాండురెడ్డి ఈసారి కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మరో 8 మంది అర్జీ పెట్టుకున్నారు. మక్తల్ నియోజకవర్గం నుంచి గతంలో కమలం అభ్యర్థిగా పోటీ చేసిన కొండయ్య.. ఈసారి పోటీ చేసేందుకు ఉత్సహం చూపుతున్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. రెండో స్థానంలో నిలిచిన జలందర్‌ రెడ్డి.. ఆ తర్వాత కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి పార్టీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. వీరితోపాటు మరో ఐదుగురు మక్తల్‌ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Telangana BJP Meeting in Hyderabad Today : బీజేపీ కీలక సమావేశం.. ఎన్నికలు, తెలంగాణ విమోచన దినోత్సవంపై చర్చ

Competition For BJP MLA Tickets in Nagarkurnool : నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి గతంలో బీజేపీ నుంచి బరిలో దిగిన దిలీపాచారి.. ఈసారి కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. మాజీ జడ్పీటీసీ మణెమ్మ కూడా కమలం అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌ రావుతోపాటు జలాల్ శివుడు అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గం నుంచి మూడు దరఖాస్తులు మాత్రమే అధిష్ఠానానికి చేరాయి. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది.

వనపర్తి నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న ఆశ్వాథామరెడ్డి, బి.కృష్ణ, బాలమనెమ్మతోపాటు.. మరో ఆరుగురు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో.. గద్వాల నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిత్వం కోసం సీనియర్ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, వెంకటాద్రిరెడ్డి, అయప్పరెడ్డి, మోహన్‌బాబు దరఖాస్తు చేసుకున్నారు. అలంపూర్, కొండగల్, షాద్‌నగర్ నియోజకవర్గాల నుంచి ఐదుగురు కమలం నేతలు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు.

Telangana BJP MLA Ticket Applications 2023 : షాద్‌నగర్‌ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి(Ex MP Jithender Reddy) తనయుడు మిధున్ రెడ్డి సైతం అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. బీజేపీలో కీలక నేతలుగా ఉన్న జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, కల్వకుర్తి నుంచి ఆచారి, దేవరకద్ర నియోజకవర్గం నుంచి పవన్​కుమార్ రెడ్డి లాంటి వాళ్లు దరఖాస్తు చేసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్ధులే లేరని రాజకీయపార్టీలు ఎద్దేవా చేస్తున్న తరుణంలో.. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 6,000 పైగా దరఖాస్తులు రావడం, వారిలో నుంచి గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం కమళదళానికి సవాలుగా మారనుంది. మరోవైపు వీలైనంత త్వరగా అభ్యర్ధుల ప్రకటన చేయాలనే డిమాండ్లు సైతం వెల్లువెత్తుతున్నాయి.

BJP Bus Yatra In Telangana : ఈ నెల 26న బీజేపీ బస్సు యాత్ర ప్రారంభం.. ముగింపు సభకు ప్రధాని మోదీ

Kishan Reddy on Telangana Elections Schedule : తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: కిషన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.