ETV Bharat / state

ఏసీబీ వలలో అటెండర్​

author img

By

Published : Feb 17, 2020, 11:34 PM IST

ATTENDER CAUGHT WHEN TAKING BRIBE IN MAHABOOBNAGAR
ATTENDER CAUGHT WHEN TAKING BRIBE IN MAHABOOBNAGAR

అధికారుల నుంచి అటెండర్ల దాకా... లంచం లేనిదే పనికాదంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మహబూబ్​నగర్​లోని ఆహార కల్తీ తనిఖీదారు కార్యాలయంలో అటెండర్​.... డిస్ట్రిబ్యూటరీ ఏజెన్సీ లైసెన్స్ రెన్యూవల్ చేసేందుకు రూ. 4000కు కక్కుర్తి పడి... ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.

మహబూబ్​నగర్​లోని ఆహార కల్తీ తనిఖీదారు కార్యాలయంలో అటెండర్ వాజీద్ రూ.4000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరకిపోయాడు. గద్వాలకు చెందిన భానుప్రకాశ్​ తన డిస్ట్రిబ్యూటరీ ఏజెన్సీ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆన్​లైన్​లో నమోదు చేసుకొని, సంబంధిత రుసుమును చెల్లించి ధరఖాస్తు చేసుకున్నాడు. లైసెన్స్ కాఫీ ఇచ్చేందుకు అంతే సరిపడా డబ్బులు తమకూ చెల్లించాలని సదరు అటెండర్ డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు భానుప్రకాశ్​ తెలపగా... పథకం వేసి పట్టుకున్నారు.

కార్యాలయంలో ఒక్కడే అటెండర్ ఉన్నాడని... మిగతా విషయాలపై విచారణ జరిపి ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నామని ఏసీబీ డీఎస్పీ వివరించారు. కార్యాలయానికి సంబంధించి ఎవరు లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలన్నా... డబ్బుల కోసం వేధిస్తూ ఉండేవాడని ఫిర్యాదుదారుడు తెలిపాడు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నా.. మళ్లీ అంతే రుసుము లంచం రూపేనా డిమాండ్ చేస్తుండటం వల్ల ఏసీబీని ఆశ్రయించానని వివరించాడు.

రూ.4000 లంచం తీసుకుంటూ దొరికిపోయిన అటెండర్​

ఇవీ చూడండి: ట్విట్టర్​ ట్రెండింగ్​లో హ్యాపీ బర్త్​డే కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.