ETV Bharat / state

వెయ్యేళ్ల శిల్పాలపై కొత్తరోడ్డు.. ఆందోళనలో పురావస్తు పరిశోధకుడు

author img

By

Published : Jun 29, 2021, 12:34 PM IST

మహబూబ్​నగర్ జిల్లా పోల్కంపల్లిలో ఉన్న క్రీస్తు శకం 11వ శతాబ్దం నాటి నాగదేవతలు, నంది, వీరుల శిల్పాలను పరిరక్షించాలని ఈమని శివనాగిరెడ్డి గ్రామపంచాయతీ అధికారులను కోరారు. రోడ్డు విస్తరణలో విలువైన శిల్ప సంపద మట్టిలో కలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

Archaeologist's eemani shivanagireddy visited Polkampally
పోల్కంపల్లిలో పురావస్తు పరిశోధకుడి పర్యటన

మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో రోడ్డుపక్కన మట్టిలో కలిసిపోతున్న ప్రాచీన విగ్రహాలను పురావస్తుశాఖ పరిశోధకుడు, కల్చరల్‌ సెంటర్‌ సీఈవో బుద్దవనం ప్రాజెక్టు కన్సల్టెంటు డా.ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు. సోమవారం పోల్కంపల్లి గ్రామాన్ని సందర్శించిన ఆయన గ్రామంలో, చెరువుకట్ట దగ్గర పడిఉన్న విగ్రహాలను పరిశీలించారు. కల్యాణ చాళుక్యుల (కీ.శ. 11వ శతాబ్దం) నాటి నాగదేవతలు, నందివీరుల శిల్పాలు రోడ్డు విస్తరణలో మట్టిలో కలిసి కనిపించకుండా పోయే ప్రమాదముందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ శిల్పాలతో పాటు.. పాతకాలం నాటి ఆయుర్వేద మందులు నూరుకునే సానరాయి, గుండ్రని కల్వం కూడ మట్టిలో కూరుకుపోతున్నాయి. వీటిని పంచాయతీ కార్యాలయంలో గానీ.. పాఠశాల ఆవరణలో గానీ భద్రపరచాలని గ్రామ సర్పంచికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామ చెరువు కట్టపైనున్న భైరవ, భైరవి, వీరభద్ర, సూర్య భగవానుల విగ్రహాలకు సైతం ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో నల్లమల నేచర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు పట్నం కృష్ణంరాజు, భూత్పూరు ఆలయ కమిటీ సభ్యుడు అశోక్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: చదువు కోసమొచ్చి.. వ్యభిచారం వృత్తి..

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.