ETV Bharat / state

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలంటూ ఉపాధ్యాయుల ర్యాలీ

author img

By

Published : Dec 6, 2020, 11:15 PM IST

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో టీపీటీఎఫ్​ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. దిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు మద్దతుగా సంఘీభావం ప్రకటించారు.

Teachers rally to demand repeal of anti-farmer laws in mahaboobabad dist
రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలంటూ ఉపాధ్యాయుల ర్యాలీ

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని వివేకానందసెంటర్​ నుంచి మదర్​థెరిసా సెంటర్​ వరకు టీపీటీఎఫ్​ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. అన్నదాతలు పండించిన పంటలపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని ప్రశ్నించారు.

పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, వ్యవసాయ నూతన చట్టాలను రద్దు చేయాలంటూ టీపీటీఎఫ్​ రాష్ట్ర కార్యదర్శి మైస శ్రీనివాస్ డిమాండ్​ చేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తే భూమిని పీల్చి పిప్పి చేస్తారని, సారవంతం కోల్పోయి ఎందుకు పనిరాకుండా పోతుందని అన్నారు. దిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు ప్రతి ఒక్కరు సంఘీభావం తెలపాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి:పోరాటం చరిత్రాత్మకం.. బంద్​లో భాగస్వామ్యం అవుతాం: ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.