ETV Bharat / state

మంత్రి సత్యవతి రాఠోడ్​కు పితృవియోగం.. పలువురు ప్రజాప్రతినిధుల సంతాపం

author img

By

Published : Feb 17, 2022, 3:37 PM IST

Minister Satyavathi's Father Passes Away
మంత్రి సత్యవతి రాఠోడ్​కు పితృవియోగం

Minister Satyavathi's Father Passes Away : రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్​కు పితృవియోగం కలిగింది. మంత్రి సత్యవతి తండ్రి లింగ్యా నాయక్ బుధవారం కన్నుమూశారు. తండ్రి పార్థివదేహం వద్ద మంత్రి సత్యవతి కంటతడి పెట్టుకున్నారు. లింగ్యానాయక్ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

Minister Satyavathi's Father Passes Away : తెలంగాణ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్‌కు పితృ వియోగం కలిగింది. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం పెద్దతండాలో ఆమె తండ్రి గుగులోత్‌ లింగ్యానాయక్‌ గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. తండ్రి మరణ వార్త విని మేడారం జాతర పర్యవేక్షిస్తున్న మంత్రి... హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు.

Minister Satyavathi's Father Passes Away
మంత్రి సత్యవతి రాఠోడ్​కు పితృవియోగం

తండ్రి పార్థివదేహం వద్ద మంత్రి సత్యవతి కంటతడి పెట్టుకున్నారు. తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బోరున విలపించారు. లింగ్యానాయక్‌ మృతిపట్ల పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి సత్యవతి రాఠోడ్‌ను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Minister Satyavathi's Father Passes Away
పలువురు ప్రజాప్రతినిధుల సంతాపం

మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు కవిత, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావుతో పాటు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.

Minister Satyavathi's Father Passes Away
తండ్రి పార్థివ దేవం వద్ద బోరున విలపించిన మంత్రి

ఇదీ చదవండి: మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి : ఇంద్రకరణ్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.