ETV Bharat / state

ఆహ్లాదకరంగా కుమురం భీం జలాశయం..

author img

By

Published : Aug 11, 2020, 4:34 PM IST

కుమురం భీం జిల్లాలోని కుమురం భీం జలాశయం జలకళను సంతరించుకుంది. వర్షాలతో జలాశయంలోకి నిండుగా నీరు చేరడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు, నిండు కుండలా జలాశయం, గేట్ల ఎత్తివేతతో పాల నురగలా ఎగిసిపడుతున్న నీరు.. ఇవన్నీ సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Komaram Bheem Reservoir
Komaram Bheem Reservoir

కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం అడ వద్ద నిర్మించిన కొమురం భీం జలాశయం ఆహ్లాదాన్ని పంచుతోంది. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు, నిండు కుండలా జలాశయం, గేట్ల ఎత్తివేతతో పాల నురగలా ఎగిసిపడుతున్న నీరు.. ఇవన్నీ సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వర్షాలతో జలాశయంలోకి నిండుగా నీరు చేరడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.

వాంకిడి మండలంలోని హైదరాబాద్‌, నాగ్‌పూర్‌ జాతీయ రహదారి నుంచి ఇంధాని రహదారి గుండా ఈ జలాశయానికి వెళ్లాల్సి ఉంటుంది. రహదారి నుంచి పది కిలోమీటర్ల దూరం వెళ్తే ఇక్కడికి చేరుకోవచ్చు. జలాశయం వరకు వాహనాలు సులభంగా వెళ్లేలా అధికారులు బీటీ రహదారిని నిర్మించారు.

ఆదివారం జలాశయం వద్ద సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబాలతో వచ్చి జలాశయాన్ని సందర్శించి వంటలు చేసుకొని తింటుంటారు.

ఇదీ చదవండి: 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్ఠి కృషితో మెరుగైన వైద్యం సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.