ETV Bharat / state

podu land pattas distribution : నేడు ఆసిఫాబాద్​కు సీఎం కేసీఆర్.. పోడుపట్టాల పంపిణీకి శ్రీకారం

author img

By

Published : Jun 30, 2023, 5:30 AM IST

Updated : Jun 30, 2023, 6:39 AM IST

podu land pattas distribution today : రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీకి సర్వం సిద్ధమైంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. వీటితో పాటు నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌, జిల్లా పోలీస్ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 15వేల మందికి పైగా పోడు రైతులకు.. నాలుగు లక్షల ఎకరాల భూమికి పట్టాలు పంపిణీ చేయనున్నారు.

KCR
KCR

podu land pattas distribution in telangana : పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చింది. పోడు సాగుదారుల నుంచి దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం వాటిని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పరిశీలించి.. కసరత్తు పూర్తి చేసి అర్హులైన వారిని ఎంపిక చేసి పట్టాలు సిద్ధం చేసింది.

KCR distributes podu land pattas today : రాష్ట్రవ్యాప్తంగా 4,06,369 ఎకరాలకు పోడు పట్టాలు సిద్ధమయ్యాయి. 1,51,146 మంది పోడు రైతులకు పట్టాలు అందనున్నాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50,595 మంది రైతులకు 1,51,195 ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాలో 24,181 మంది రైతులకు 67,730 ఎకరాలకు పట్టాలు ఇవ్వనున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15,519 మంది రైతులకు 47,138 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేయనున్నారు.

CM KCR Asifabad Tour : ఆదిలాబాద్​లో 31,683 ఎకరాలకు గాను 12,222 పోడు రైతులకు.. నిర్మల్ జిల్లాలో 20,051 ఎకరాలకు 7,275 మంది పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేస్తారు. ములుగు జిల్లాలో 18,460 ఎకరాలకు గాను 7,129 మంది రైతులకు.. ఖమ్మం జిల్లాలో 12,470 ఎకరాలకు గాను 6,598 పోడు రైతులకు పోడు పట్టాలు అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో 11,347 ఎకరాలకు గాను 5,015 మంది రైతులకు.. నిజామాబాద్ జిల్లాలో 8,611 ఎకరాలకు గాను 4,229 మంది రైతులకు పట్టాలు అందించనున్నారు.

వరంగల్​లో 7,333 ఎకరాలకు గాను 4271 మందికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 8,088 ఎకరాలకు గాను 3250 పోడు రైతులకు పట్టాలు ఇస్తారు. నల్గొండ జిల్లాలో 5,578 ఎకరాలకు గాను 2,928 మందికి, మంచిర్యాల జిల్లాలో 5,024 ఎకరాలకు గాను 2,403 రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 5,056 ఎకరాలకు గాను 1,973 మందికి.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,859 ఎకరాలకు సంబంధించి 1,614 రైతులకు పట్టాలు ఇస్తారు.

సంగారెడ్డి జిల్లాలో 1,808 ఎకరాలకు గాను 1,127 రైతులకు.. మెదక్ జిల్లాలో 525 ఎకరాలకు గాను 610 పోడు రైతులకు పట్టాల పంపిణీ ఉంటుంది. వికారాబాద్ జిల్లాలో 436 మంది రైతులకు చెందిన 553 ఎకరాలకు.. వనపర్తి జిల్లాలో 389 మంది రైతులకు చెందిన 455 ఎకరాలకు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 205 మంది రైతులకు 213 ఎకరాలకు పోడు పట్టాలు అందిస్తారు.

సూర్యాపేట జిల్లాలో 84 ఎకరాలకు గాను 84 మందికి.. హనుమకొండ జిల్లాలో 65 ఎకరాలకు గాను 70 మందికి రైతులకు పట్టాల పంపిణీ ఉంటుంది. మహబూబ్​ నగర్ జిల్లాలో 13 ఎకరాలకు గాను 19 మందికి.. జగిత్యాల జిల్లాలో 20 ఎకరాల గాను 15 మంది రైతులకు.. పెద్దపల్లి జిల్లాలో రెండు ఎకరాలకు గాను నలుగురికి.. నారాయణపేట జిల్లాలో ఎనిమిది ఎకరాలకు గాను ముగ్గురు రైతులకు పట్టాలు అందించనున్నారు.

పోడు పట్టాల పంపిణీని కుమురంభీం ఆసిఫాబాద్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌, జిల్లా పోలీస్ కార్యలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యలయంను ప్రారంభించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు హరీశ్​రావు, పువ్వాడ అజయ్​కుమార్ పోడుపట్టాలు పంపిణీ చేయనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ పోడుపట్టాలు అందిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారిగా కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సమక్షంలో పోడు పట్టాల పంపిణీ చేపడతారు. పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వడంతో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాలను కూడా వర్తించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కొత్తగా పోడు పట్టాలు పొందిన వారి పేరిట ప్రభుత్వమే ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచి భూయాజమానులకు రైతుబంధు సాయాన్ని జమచేయనున్నారు.

పోడు పట్టాల పంపిణీతో పాటే అటవీ భూముల అన్యాక్రాంతాన్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం.. కమతాల చుట్టూ ఉన్న అటవీ భూముల రక్షణ సదరు పట్టాదారులకే అప్పగించనుంది. భవిష్యత్తులో అటవీ భూముల పరిరక్షణే ధ్యేయంగా అటవీశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక నుంచి పోడుకు పట్టాలు ఇచ్చిన తర్వాత ఇకపై అంగుళం భూమి ఆక్రమణలకు గురి కాకుండా పక్కాగా చర్యలు తీసుకునేలా కార్యాచరణ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఇవీ చదవండి:

Last Updated :Jun 30, 2023, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.