ETV Bharat / state

'వ్యాపారులు, ప్రజలు విధిగా లాక్​డౌన్ నిబంధనలు పాటించాలి'

author img

By

Published : May 24, 2021, 5:07 PM IST

కాగజ్ నగర్ పట్టణంలో కొవిడ్​ మహమ్మారి నియంత్రణకై… లాక్​డౌన్​ అమలు కోసం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు పుర కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు. లాక్​డౌన్​ సడలింపు సమయంలో వ్యాపారులు, ప్రజలు కొవిడ్​ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

kagaznagar commissioner srinivas
'వ్యాపారులు, ప్రజలు విధిగా లాక్​డౌన్ నిబంధనలు పాటించాలి'

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కరోనా కట్టడి కోసం… లాక్​డౌన్​ అమలుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు పుర కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. లాక్​డౌన్ సడలింపు సమయంలో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం రావడంతో రద్దీ పెరిగి ప్రజలు భౌతికదూరం పాటించడం లేదని అన్నారు.

ఈ నేపథ్యంలో బల్దియా అధికారులు, వ్యాపార సముదాయాలు, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో భౌతికదూరం ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతీ దుకాణం ముందు కనీస భౌతిక దూరం పాటించేలా గుర్తులు పెట్టారు. వినియోగదారులు ఆ గుర్తుల్లో నిలబడి సరుకులు, వస్తువులు కొనుగోలు చేయాలని సూచించారు. వ్యాపారులు విధిగా లాక్​డౌన్ నిబంధనలు అమలు చేయాలని కమిషనర్ శ్రీనివాస్ ఆదేశించారు.

ఇదీ చూడండి: కాళ్లకు బొబ్బలెక్కినా.. నడక ఆగదు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.