ETV Bharat / state

మాస్కుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

author img

By

Published : May 27, 2020, 12:32 PM IST

బయటకు వచ్చిన జనాలు తప్పని సరిగా ముఖానికి మాస్కులు ధరించే విధంగా ఖమ్మం నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంది. ప్రజలకు మాస్కులు అందుబాటులో ఉండేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ మాస్కుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు.

transport minister puvvada ajay kumar inaugurated masks parches center in kammam
మాస్కుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్ ఖమ్మంలో మాస్కుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. నగరంలో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో మాస్కుల విక్రయకేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రి, ఖమ్మం బస్టాండ్‌, గాంధీచౌక్‌లో విక్రయ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఒక్క వస్త్రం మాస్కు 10 రూపాయలకు విక్రయిస్తున్నారు.

ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.