ETV Bharat / state

సమయం వచ్చినప్పుడు .. తప్పకుండా చేసి చూపిస్తా: పొంగులేటి

author img

By

Published : Jan 1, 2023, 5:27 PM IST

Ponguleti Srinivasa Reddy Comments On Elections: రాష్ట్రంలో రాబోయే ఎన్నికలపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​లో ఏం జరిగిందో.. ఎందుకు జరిగిందో తమకు తెలియనిది కాదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలోని అర్హత ఉన్నవారంతా పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు.

Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy Comments On Elections : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన 4 ఏళ్లలో బీఆర్​ఎస్​లో ఏం జరిగిందో తమకు తెలుసని అన్నారు. పార్టీలో దక్కిన గౌరవం ఏంటో తెలుసని అనుచరులతో పేర్కొన్నారు. బీఆర్​ఎస్​లో ఏం జరిగిందో.. ఎందుకు జరిగిందో తెలియనిది కాదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అర్హత ఉన్నవారంతా పోటీ చేస్తారని తెలిపారు. ప్రజలు మెచ్చేవారంతా తప్పకుండా పోటీలో ఉంటారని వ్యాఖ్యానించారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో నిర్వహించిన న్యూ ఇయర్‌ వేడుకల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ వేదికపై ఉన్న నేతలంతా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు మీరు కోరుకునేది తప్పకుండా చేసి చూపిస్తానని పేర్కొన్నారు. ఇది రాజకీయ వేదిక కాదు.. మిగిలిన వివరాలు తర్వాత చెబుతానని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి: పోడు రైతులకు శుభవార్త.. పట్టాల పంపిణీకి డేట్​ ఫిక్స్​.. ఎప్పుడంటే..?

ప్రభుత్వం కీలక నిర్ణయం.. 'పంత్‌ను కాపాడిన డ్రైవర్‌, కండక్టర్​కు సన్మానం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.