ETV Bharat / state

దొంగచాటుగా కండువా కప్పుకోను: పొంగులేటి

author img

By

Published : Jan 10, 2023, 10:42 AM IST

Ponguleti
పొంగులేటి

Ponguleti Hot comments : పార్టీ మారడంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీఆర్​ఎస్​ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఒక వేళ మార్పు ఖాయమైతే ఖమ్మం నడిబొడ్డున రెండున్నర లక్షల మంది కార్యకర్తల సమక్షంలో కండువా కప్పుకొంటానని ఆయన స్పష్టం చేశారు.

Ponguleti Hot comments : ఒక వేళ బీఆర్​ఎస్​ను వీడాల్సి వస్తే దిల్లీలోనో, అమెరికాలోనో దొంగచాటుగా కండువా కప్పుకోవాల్సిన అవసరం తనకు లేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం నడిబొడ్డున 2.50 లక్షల మంది అభిమానుల సమక్షంలో కండువా కప్పుకొంటానని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో సోమవారం విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

Ponguleti on party shift: ‘ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు తాను బీఆర్​ఎస్​ను వీడుతున్నానని మీడియానే ప్రచారం చేస్తోందని అన్నారు. అంతకుముందు పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పర్సా వెంకటేశ్వరరావు ఇంటి వద్ద కార్యకర్తలతో ఆయన కాసేపు ముచ్చటించారు. అందరికీ అండగా ఉంటానని ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.