ETV Bharat / state

Officials Removed Flags and Banners of Political Parties Telangana : ఎలక్షన్ కోడ్ వచ్చింది.. బ్యానర్లు, ప్రకటనల తొలగింపు మొదలైంది

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 7:52 PM IST

Officials Removed Flags and Banners of Political Parties Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల కోడ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రకటనలను, ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. మరోవైపు మధ్యాహ్నం 12 గంటలకు ఈసీ ప్రకటన ఉండగా.. అంతకు ముందే నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున అధికారిక కార్యక్రమాలను పూర్తిచేశారు.

political parties Telangana
GHMC Removed Posters and Banners

Officials Removed flags and banners of political parties Telangana : తెలంగాణలో ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో.. ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రకటనలను, ఫ్లెక్సీలను అధికారులు తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి.. ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ పథకాల ప్రచార పోస్టర్లను అధికార యంత్రాంగం తొలగించింది. కలెక్టరేట్‌ ఆవరణతో పాటు ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పథకాల బోర్డులను తొలగించారు. కార్యాలయాల్లోని పీఎం, సీఎం ఫోటోలను తీసేశారు. రాష్ట్రంలో అంతటా ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల కోడ్(Election Code) రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Party Flexis Removed to Enforce Code of Conduct : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని డివైడర్లకు ఉన్న.. గులాబీ రంగులను తీసేసి తెల్లని రంగును వేశారు. ఖమ్మంలో అధికారులు.. ఎన్నికల కోడ్‌ అమలు చేసే పనిలో పడ్డారు. నగరంలో ఉన్న అధికార పార్టీ మంత్రి పువ్వాడ ఫ్లెక్సీలు తొలగించారు. వీధుల్లో అధికార కార్యక్రమాలకు చెందిన ప్రచార బోర్డులను తీసేస్తున్నారు.

GHMC Removed Posters and Banners : హైదరాబాద్​లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కార్యాలయం ఎదుట ఉన్న భారీ హోర్డింగ్‌లను.. ఎక్కడికక్కడ సంక్షేమ పథకాల సూచికలు తొలగిస్తున్నారు. అలాగే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల ప్రవర్తన నియమాల అమలుని అధికారులు వెంటనే ప్రారంభించారు. పట్టణంలోని ఆయా పార్టీల నేతలకు చెందిన విగ్రహాలను వస్త్రాలతో కనిపించకుండా ముసుగులు వేశారు. పలుచోట్ల గోడపత్రికలను తొలగించడంతో పాటు ప్రచార హోర్డింగుల తొలగింపు ప్రక్రియను చేపట్టారు.

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల పూర్తి వివరాలు ఇవే..

Telangana Assembly Election Schedule 2023 : మరోవైపు ఎన్నికల షెడ్యూల్‌ దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈసీ ప్రకటన ఉండగా.. అంతకు ముందే నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.

Election Code Effect in Telangana : వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో రూ.14 కోట్ల నిధులతో చేపట్టిన వంద పడకల ప్రభుత్వాసుపత్రి, నూతన మున్సిపాలిటీ భవనం, అంబేద్కర్ విగ్రహం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్​తో కలిసి మంత్రి ఎరబెల్లి(Minister Erabelli Dayakar Rao) ప్రారంభించారు. ఎన్నికల నోటిఫికేషన్(Telangana Election Notification) నేపథ్యంలో.. 12 గంటలలోపే ఈ కార్యక్రమాలను హడావిడిగా నిర్వహించగా.. అధికారులు, ప్రజాప్రతినిధులు ఉరుకులు పరుగులు తీశారు. దాదాపు సిట్టింగ్‌లందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మళ్లీ అవకాశం ఇవ్వటంతో సీఈసీ షెడ్యూల్‌ ప్రకటనకు ముందే.. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారిక కార్యక్రమాలను పూర్తిచేశారు.

CEO Vikas Raj on Telangana Elections : 'రాష్ట్రంలో ఎలక్షన్​ కోడ్​ అమలు.. ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి'

Telangana Assembly Elections Schedule 2023 : తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా.. నవంబర్​ 30న పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.