ETV Bharat / state

రైతులను ముంచిన మిగ్​జాం తుపాన్ - అధికారులు ఆదుకోకపోతే కోలుకోలేమంటున్న అన్నదాతలు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2023, 8:53 PM IST

Huge Crops Loss to Farmers in Telangana
Cyclone Michaung Effect in Telangana

Huge Crops Loss to Farmers in Telangana : ఆంధ్రప్రదేశ్‌లో కల్లోలం సృష్టించిన మిగ్‌జాం తుపాన్ ప్రభావం, రాష్ట్రంపైనా పడింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ జిల్లాలు తల్లడిల్లాయి. ఆరుగాలం శ్రమించిన రైతులకు వానలు విషాదాన్ని మిగిల్చాయి. చేతికొచ్చిన వరి, మిర్చి, పత్తి కల్లాల్లోనే నీటమునిగింది. అపార నష్టంతో అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసిన తుపాను ధాటికి, వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంట నష్టంపై పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆరబోసిన ధాన్యం తడిసినందున ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని కర్షకులు వేడుకుంటున్నారు.

రైతులను ముంచిన మిగ్​జాం తుపాన్ - అధికారులు ఆదుకోకపోతే కోలుకోలేమంటున్న అన్నదాతలు

Huge Crops Loss to Farmers in Telangana : మిగ్‌జాం తీవ్ర తుపాను ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. తెరిపివ్వకుండా దంచికొట్టిన వర్షాలకు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, వేరుశనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మూడురోజులుగా వరుణుడి ప్రతాపానికి పత్తి పంట రంగుమారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చే దశలో వరి పైర్లు వాలిపోయి.

మిగ్​ జాం తుఫాను ప్రభావం - నష్టాల్లో మునుగుతున్న తెలంగాణ రైతులు

వాననీటిలో నానుతున్నాయి. కోతలు పూర్తయిన రైతులు కల్లాల్లో, రహదారుల వెంట(On Roads) ఆరబోసిన ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. రాసులు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. మరోవైపు టార్పాలిన్లు, పట్టాలు కప్పి ధాన్యం కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.

Cyclone Michaung Effect in Telangana :భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో వేరుశనగ, వరి, మిరప, మొక్కజొన్న, పొగాకు సాగుదారులు కుదేలయ్యారు. అశ్వారావుపేట,దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో సుమారు రెండు వేల ఎకరాల్లో వేరుశనగ పంట(Groundnut Crop) దెబ్బతింది. బూజుపడితే నాణ్యత తగ్గి మార్కెట్‌లో ఎవరూ కొనరని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలుల ధాటికి వరిపంట వాలిపోయింది. అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి, నారాయణపురంలో మూడు ఇళ్లు కూలిపోయాయి.

మిగ్​జాం బీభత్సం- భారీ వర్షాలకు 8 మంది మృతి, స్కూళ్లు బంద్

పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం, అశ్వాపురం, పినపాక మండలాల్లో భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. చేతికొచ్చిన పంట వర్షార్పణమైందని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. అశ్వాపురం మండలం భీమవరంలో చలిగాలులకు 40 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వాగులు పొంగి గొందిగూడెం, తుమ్మలచెరువు మధ్య రాకపోకలు(Communion) నిలిచిపోయాయి. ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో వరి, మిర్చి, పత్తి పంటలకు అపార నష్టం వాటిల్లింది. వరి పొలాల్లోకి భారీగా నీరు చేరడం వల్ల మొలకలు వస్తాయని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారేపల్లి మండలంలోనూ మిర్చితోటలు నీటమునిగాయి.

MLA Ponguleti Srinivas Reddy Review on Crop Loss : భద్రాద్రి జిల్లా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని పంట పొలాల్లోకి నీరు చేరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న చేతికందే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో తుపాన్ తాకిడికి పంటపొలాలు చెరువులను తలపించాయి. వరి కోతలకు సిద్ధమవుతున్న తరుణంలో నీట మునిగిన పొలాలు, తోటలు చూసి సాగుదారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వైరా, ఏన్కూరు, కొణిజర్ల, తల్లాడ మండలాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది.

వర్షాభావంతో అల్లాడిన రైతులకు అకాలవర్షం తీరని వేదనను మిగిల్చింది. ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో వరి, మిరప, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలతో సింగరేణి ప్రాంతంలో బొగ్గు వెలికితీతకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కోయగూడెం ఓసీలో 13 వేల టన్నుల నల్లబంగారం ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాల దృష్ట్యా యంత్రాంగం చర్యలు చేపట్టాలని పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పంటనష్టంపై హైదరాబాద్‌ నుంచే సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధిత రైతులకు భరోసా(Farmers Assurance) కల్పించాలని దిశానిర్దేశం చేశారు.

Farmers Problems in Telangana : ములుగు జిల్లా ఏటూరునాగారం డివిజన్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో తుపాను ధాటికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తాడ్వాయి, మంగపేట, వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల పరిధిలో పంటలు చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లాల్లో ధాన్యపురాశులు నీటిలో తేలియాడుతున్నాయి. మద్దతు ధరకు వడ్లు కొని ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట,రాయపర్తి, పర్వతగిరి, సంగెం, ఐనవోలు మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసింది.

మిగ్​జాం తుపాను బీభత్సం - పంట నష్టంతో రైతన్న గుండెకు గాయం

పత్తి పంటకు సైతం నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలకు కొత్తగూడ, గంగారం, గూడూరు, గార్ల, బయ్యారం మండలాల్లో వరి, మిరప, పత్తి పంటలు(Cotton Crop) దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు సాగుదారులు నానా తంటాలు పడ్డారు. సరిపోను టార్ఫాలిన్లు లేక వడ్ల రాశుల్లోకి వరదనీరు చేరింది. ఆరుగాలం కష్టం వర్షార్పణమైందని, అధికారులు ఆదుకోకపోతే కోలుకోలేమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణపై మిగ్​జాం తుపాను ప్రభావం - పలు విమానాలు రద్దు

మిగ్​జాం తుపాను ఎఫెక్ట్​తో 305 రైళ్లు రద్దు - ఇదిగో పూర్తి లిస్ట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.